North Korea: సన్నబడ్డ కిమ్.. ఆరోగ్య సమస్యలే ఇందుకు కారణమా

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. లావుగా ఉండే కిమ్‌.. స్లిమ్‌గా మారడమే దీనికి కారణం. ఈ మధ్యే జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా...

North Korea: సన్నబడ్డ కిమ్.. ఆరోగ్య సమస్యలే ఇందుకు కారణమా

Kim Thinner

North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. లావుగా ఉండే కిమ్‌.. స్లిమ్‌గా మారడమే దీనికి కారణం. ఈ మధ్యే జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. అందులో కిమ్‌ చాలా
బరువు తగ్గినట్లు కనిపించారు.

ఆయన కావాలనే బరువు తగ్గారా? లేదా అనారోగ్య కారణాల వల్ల సన్నబడిపోయారా? ఈ విషయంపై స్పష్టత లేదు. దీంతో కిమ్‌ ఆరోగ్యంపై చర్చ మరోసారి ఊపందుకుంది. కిమ్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో భాగంగానే బరువు తగ్గి ఉంటారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తర కొరియా అధినేతకు సంబంధించిన విషయాలపై పొరుగు దేశం దక్షిణ కొరియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. గతేడాది దక్షిణ కొరియా నిఘా వర్గాలు కిమ్‌ బరువు దాదాపు 140కిలోలు ఉన్నట్లుగా వెల్లడించాయి. 2011లో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏటా కిమ్‌ దాదాపు 6 నుంచి 7కిలోల బరువు పెరిగినట్లు అంచనా వేశాయి.

అలాంటి ఆయన సడన్‌గా బరువు తగ్గి కనిపించడంతో అందరూ షాక్‌ అయ్యారు. కిమ్‌ ఆరోగ్యంపై కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. గతేడాది కొన్ని నెలలు అజ్ఞాతంలోకి వెళ్లడం మరింత బలాన్ని చేకూర్చింది. ఒకానొక సమయంలో కిమ్‌ మృతి చెందారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి.

తర్వాత వివిధ అధికారిక కార్యక్రమాల్లో కిమ్‌ పాల్గొన్న ఫోటోలను విడుదల కావడంతో ఆ పుకార్లకు చెక్‌ పడింది.