అణుబాంబుతో మీటింగ్ : ప్రత్యేక రైలులో రష్యా బయల్దేరిన కిమ్

  • Published By: venkaiahnaidu ,Published On : April 24, 2019 / 01:48 AM IST
అణుబాంబుతో మీటింగ్ : ప్రత్యేక రైలులో రష్యా బయల్దేరిన కిమ్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ప్రత్యేక రైలులో రష్యా బయల్దేరారు.బుధవారం(ఏప్రిల్-24,2019)ప్రభుత్వ,మిలటరీ ఉన్నతాధికారులతో కలిసి ఆయన రైలులో రష్యాకి బయల్దేరి వెళ్లినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం కోసం వెళ్తున్నతమ అధ్యక్షుడిని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు,అధికారులు ప్యాంగ్యాంగ్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినట్లు తెలిపింది.

గురువారం(ఏప్రిల్-25,2019)రష్యాలోని వ్లడివోస్టోక్ నగరంలో పుతిన్-కిమ్ ల మధ్య ఫస్ట్ టైమ్ సమావేశం జరగనుంది. కొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతిష్ఠంభనపై వీరిద్దరూ చర్చించనున్నారు.అయితే సంయుక్త ప్రకటన,ఒప్పందాలపై సంతకాలు వంటివి ఈ  సమావేశం సందర్భంగా ఉండవు.గతంలో జిన్ పింగ్ తో సమావేశమయ్యేందుకు చైనాకి,ట్రంప్ తో సమావేశమయ్యేందుకు వియత్నాం రాజధాని హనోయ్ కి కిమ్ తన ప్రత్యేక రైలులో వెళ్లి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే.విమానం కన్నా కిమ్ ఎక్కువగా ట్రైన్ జర్నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.భధ్రత దృష్యా ట్రైన్ జర్నీ బెటర్ అని కిమ్ భావిస్తాడు.