Maternal and child health : తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందున్న దేశం

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రపంచంలోనే ముందున్న దేశం నార్వే. నార్వేలో శిశు మరణాల రేటు వెయ్యికి రెండు కంటే తక్కువగానే ఉంది అంటే అక్కడి ప్రభుత్వం తల్లీ బిడ్డల ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంంటోంది అర్థం చేసుకోవచ్చు.

Maternal and child health : తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందున్న దేశం

Maternal And Child Health

Maternal and child health : మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సిరి సంపదలు కొలువై ఉంటారని చెబుతుంటారు. సిరి సంపదలు అంటే ధన ధాన్యాలనే కాదు. సంతోషం కూడా. ఓ మహిళ ఆరోగ్యంగా..ఆనందంగా ఉంటే ఆ కుటుంబం కూడా అలాగే ఉంటుంది. తల్లి బిడ్డల ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే. ఒక్క ఇల్లే అలా ఉందంటే మరి దేశమే అలా ఉంటే. అలా తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడ్డంలో ప్రపంచంలోనే ముందున్న దేశం ఒకటుంది. అదే నార్వే.

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రపంచంలోనే ముందున్న దేశం నార్వే. నార్వేలో శిశు మరణాల రేటు వెయ్యికి రెండు కంటే తక్కువగానే ఉంది అంటే అక్కడి ప్రభుత్వం తల్లీ బిడ్డల ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంంటోంది అర్థం చేసుకోవచ్చు. ఇక మాతృ మరణాల విషయంలో కూడా ప్రపంచ దేశాలన్నింటికంటే మెరుగ్గా ఉంది నార్వే. 15,000కి కేవలం 1గా నమోదవుతోంది.

అంతేకాదు అన్ని ఆరోగ్య సూచికల్లోనూ నార్వే మంచి స్థానాన్ని సాధించింది. అలాగే ఇక్కడ తల్లి కాబోయే మహిళలకు 36 నుంచి 46 వారాల పాటు పేరెంటల్ లీవ్‌ని మంజూరు చేస్తారు. వంద శాతం జీతంతో ఈ సెలవులను తీసుకోవచ్చు మహిళలు. అంతేకాదు.. నార్వేలో పిల్లలందరూ మంచి విద్య, ఆరోగ్యం పొందగలుగుతారు. ఎందుకంటే పిల్లలందరికీ నార్వే ప్రభుత్వం మంచి విద్యను..ఆరోగ్యాన్ని అందిస్తోంది. మరి విద్య..ఆరోగ్యం ఉండే ఆనందం ఇంకెక్కడుంటుంది? అదే నార్వే గొప్పతనం. ఇక్కడ తల్లీ బిడ్డలు చాలా సౌకర్యవంతంగా..ఆరోగ్యంగా ఉంటున్నారు. 2021లో కూడా నార్వే తల్లీ బిడ్డలకు ఆరోగ్యాన్ని అందించటంలో ముందే ఉంది.