Pink Sky: ఏలియన్లు కాదా.. ఆకాశమంతా గులాబి రంగులోకి..

ఆస్ట్రేలియాలోని మిల్దురా పట్టణ స్థానికులకు అదొక పజిల్. బుధవారం సాయంత్రం ఆకాశమంతా వింతగా పింక్ రంగులోకి మారిపోయింది. సోషల్ మీడియాలో దట్టమైన మేఘంతో కూడిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

Pink Sky: ఏలియన్లు కాదా.. ఆకాశమంతా గులాబి రంగులోకి..

Cannabis

 

 

Pink Sky: ఆస్ట్రేలియాలోని మిల్దురా పట్టణ స్థానికులకు అదొక పజిల్. బుధవారం సాయంత్రం ఆకాశమంతా వింతగా పింక్ రంగులోకి మారిపోయింది. సోషల్ మీడియాలో దట్టమైన మేఘంతో కూడిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అదేదో భూమి మీద నుంచి గగనతలంలోకి లైట్ ఫోకస్ చేస్తున్నట్లు కనిపించింది. నేల మీద నుంచి పింక్ లైట్ ఆకాశంలోకి పడుతున్నట్లుగా కనిపించడంతో స్థానికులంతా ఏలియన్లని భ్రమపడ్డారు.

వాళ్లే కాదు.. సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసిన వారంతా ఏదో వింత జరుగుతుందన్నట్లుగా భావించారు. కొందరు ధైర్యం చేసి ఆ ప్రదేశ సమీపానికి వెళ్లి చూసి దానిపై క్లారిటీ ఇచ్చారు.

ఫార్మాసూటికల్ కంపెనీకి చెందిన గంజాయి తోట నుంచి ఆ పింక్ మెరుపు వస్తుందట. మరుసటి రోజు కూడా కాస్త అటువంటి కాంతే కనిపించిందని ఫోటోలు పెట్టి ప్రూవ్ చేశారు. దీనిని ఆ ఫార్మాసూటికల్ కంపెనీ కూడా కన్ఫామ్ చేసింది. మొక్కల ఎదుగుదలలో భాగంగా పలు రకాల కాంతులు ఉన్న లైట్ వెలిగిస్తుంటామని చెప్పారు. అవి పువ్వుల దశలో ఉన్నప్పుడు రెడ్ లైట్ తరచుగా వాడుతుంటామని పేర్కొన్నారు.

Read Also: ‘ఏలియన్లు కిడ్నాప్ చేశాయి.. వాటితో ప్రేమలో పడ్డా’

“దీని కోసం ఎల్ఈడీ లైట్లు వాడుతుంటాం. రెగ్యూలర్ గా సూర్యాస్తమయానికి వాటిని ఆఫ్ చేస్తాం. కానీ, వాటిని పరీక్షిస్తుండటంతో ఆ రెండ్రోజులు లైట్‌ను కాస్త లేట్‌గా ఆఫ్ చేశాం. మొక్కలు నిద్రపోయేసమయానికి లైట్లు ఆర్పేశాం” అని ఆ యాజమాన్యం వెల్లడించింది.

ఆస్ట్రేలియాలో గంజాయి తోటల పెంపకానికి లైసెన్స్ పొందిన తొలి కంపెనీ Cann Group. మెడిసినల్, రీసెర్చ్ ప్రయోజనార్థం దీనిని ఉపయోగిస్తారు.