Elon Musk: తాలిబాన్లకు కరోనా గురించి తెలియదా? ప్రపంచ కుభేరుడి అనుమానం!

ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన తాలిబాన్ల వ్యవహారంపై అయితే ప్రపంచ కుభేరుడు, బిలియనీర్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌ స్పందించారు.

Elon Musk: తాలిబాన్లకు కరోనా గురించి తెలియదా? ప్రపంచ కుభేరుడి అనుమానం!

Taliban (2)

Elon Musk: ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన తాలిబాన్ల వ్యవహారంపై అయితే ప్రపంచ కుభేరుడు, బిలియనీర్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌ స్పందించారు. ఎలన్‌ మస్క్‌ మొదటిసారిగా తాలిబన్లు మాస్క్‌లు లేకుండా ఓ చోట సమావేశమైన ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్‌ విపరీతంగా విస్తరిస్తున్నట్లు తాబలిన్లకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. కరోనా గురించి వారు వినలేదా? అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. “నిజమేనా? మీరు దానిపై తాలిబన్లను విమర్శించబోతున్నారా? యూఎస్ 20 సంవత్సరాల పాటు చేయలేనిది.. వారు 19 రోజుల్లో సాధించిన దాని గురించి కాదా..? ఈ సమయంలో డెల్టాకు ప్రాధాన్యత లేదని నేను భావిస్తున్నాను” అని చమత్కరించాడు. మరికొందరైతే, తాలిబన్ల ఆకృత్యాలపై ప్రశ్నించకుండా మరో అంశంపై ప్రశ్నించడం ఏమిటంటూ నిలదీస్తున్నారు.

గతేడాది ధనవంతుల జాబితాలో 35వ స్థానంలో ఉన్న ఎలన్ మస్క్.. ఏడాదిలో ఫస్ట్ ప్లేస్‌కి చేరుకున్నాడు. బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం మస్క్ ఆస్తి విలువ 188.5 బిలియన్ డాలర్లు. టెస్లా షేర్ల ధరలు పెరగడంతో మస్క్ ఆస్తి విలువ అమాంతం పెరిగింది. అందుకే ఆయనే ఇప్పుడు ప్రపంచంలోని రిచ్ వ్యక్తులలో మొదటివాడు అయ్యాడు. ప్రస్తుతం మస్క్ వయసు నలభై తొమ్మిదేళ్లు. ఎలన్​ 12 సంవత్సరాల వయస్సులో బ్లాస్టర్ అనే వీడియోగేమ్ తయారు చేయగా.. పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక దీనిని 500 డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పుడు మొదలైన అతని జీవితం ఆగకుండా విజయాలతో సాగుతూనే ఉంది.