India-US Partners: రష్యా కాదు అమెరికానే: భారత్ కు నిజమైన భాగస్వామి మేమే అంటూ అమెరికా ప్రకటన

భారత్ లో రక్షణ, జాతీయ భద్రతను పెంపొందించేందుకు ఎంత దూరమైన తాము ఆదేశంతో కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి

India-US Partners: రష్యా కాదు అమెరికానే: భారత్ కు నిజమైన భాగస్వామి మేమే అంటూ అమెరికా ప్రకటన

Us India

India-US Partners: రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిన అనంతరం..భారత్ కు అత్యంత సన్నిహిత భాగస్వామిగా అమెరికానే ఉంటుందని, రష్యా కాదని అమెరికా వర్గాలు ప్రకటించాయి. భారత్ లో రక్షణ, జాతీయ భద్రతను పెంపొందించేందుకు ఎంత దూరమైన తాము ఆదేశంతో కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. “రష్యా భవిష్యత్తు ఆందోళనకరంగా ఉన్న సమయంలో భారత్ కు నమ్మకమైన భాగస్వామిగా కనసాగేందుకు ఆదేశానికి సాధయం కాదని, యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యా తన వద్దనున్న ఆయుధాలను పెద్ద సంఖ్యలో ఉపయోగించింది. ఈక్రమంలో భారత్ కు రక్షణ పరికరాలు అందించాలంటే రష్యాకు సాధ్యపపడని పని. అందుకే భారత్ తో మా భాగస్వామ్యం ధృడంగా కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం” అని అమెరికా జాతీయ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ముఖ్య సలహాదారు డెరెక్ చోలెట్ వెల్లడించారు.

Also read:Bulldozrr politics : దేశాన్ని భయపెడుతున్న బుల్డోజర్ రాజకీయాలు..యూపీలో మొదలై హస్తినకు అరాచకాలు

రక్షణ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్న భారత్, రక్షణ పరికరాల సరఫరాపై పెద్ద ఎత్తున ఆధారపడిందని, ఈ విభాగంలో భారత్ తో కలిసి పనిచేసేందుకు అమెరికా ఎంతో కృతనిశ్చయంతో ఉన్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డెరెక్ పేర్కొన్నారు. “రక్షణ పరమైన అంశాల్లో గతంలో కంటే భారత్ – అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. తమ సామర్ధ్యాలను పెంచుకోవాలని భావిస్తున్న భారత్ కు ఆదిశగా అమెరికా తన వంతు సహాయం చేస్తుంది” అని డెరెక్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో రష్యాతో వ్యాపార సంబంధాలు మరింత కష్టతరంగా మారనున్నాయని, గత 12 వారాలుగా ఆదేశంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇకపై వారు కొన్ని కీలక ఉత్పత్తులను ఎగుమతి చేయలేరని డెరెక్ చెప్పుకొచ్చారు.

Also read:India Covid Cases : దేశంలో కొత్తగా 2,451 కోవిడ్ కేసులు

రక్షణ పరికరాలు సహా నిర్దిష్ట ఉత్పత్తులను తయారు చేయడానికి కీలకమైన సాంకేతికతలను దిగుమతి చేసుకోవడంలో రష్యా అసమర్థత కారణంగా, ఆ రకమైన రక్షణ పరికరాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని డెరెక్ పేర్కొన్నారు. “ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. అమెరికా – భారత్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపలేదు. యుఎస్-ఇండియా సంబంధం లోతైనది, అది బలంగా ఉంది”అని దానికి అమెరికాతో ద్వైపాక్షిక మద్దతు ఉందని డెరెక్ వెల్లడించారు. కాగా, 1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధం సమయంలో బంగాళాఖాతంలో అమెరికా తన ఏడవ నౌకాదళాన్ని మోహరింపజేయడం ఇంకా భారతీయులకు గుర్తుందని, ఆ నాటి నుంచి అమెరికా నమ్మదగిన భాగస్వామి కాదని కొందరు భారతీయులు భావిస్తున్నారని విలేకరి అడిగిన ప్రశ్నకు డెరెక్ సమాధానం దాటేశారు.

Also read:Food crisis in Shanghai: ఆహారం కోసం అలమటిస్తున్న చైనా వాసులు: లాక్ డౌన్ లోనే షాంఘై నగరం