Novak Djokovic: యూఎస్ ఓపెన్‌కు జకోవిచ్ దూరం.. వ్యాక్సినేషనే కారణం

టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. కోవిడ్ వ్యాక్సినేషన్ నిబంధనల ప్రకారం అమెరికాలో జరిగే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదని చెప్పాడు.

Novak Djokovic: యూఎస్ ఓపెన్‌కు జకోవిచ్ దూరం.. వ్యాక్సినేషనే కారణం

Novak Djokovic: టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని జకోవిచ్ స్వయంగా, సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వ్యాక్సినేషన్ కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. టెన్నిస్ ప్రపంచం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యూఎస్ ఓపెన్-2022 ఈ నెల 29 నుంచి న్యూయార్క్‌లో ప్రారంభం కానుంది.

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

అమెరికాలో పర్యటించాలంటే ఇతర దేశస్థులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించాలి. అయితే, సెర్బియాకు చెందిన దిగ్గజ ఆటగాడైన జకోవిచ్ ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదు. తన శరీరం సహజంగానే కోవిడ్ నుంచి రక్షణ పొందాలని, తాను ఎప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనని ప్రకటించాడు. దీంతో వ్యాక్సిన్ తీసుకోని కారణంగా అతడు అమెరికాలో పర్యటించేందుకు అనర్హుడు. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాక్సినేషన్ నిబంధనలను అనుసరించి, తాను యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదని జకోవిచ్ చెప్పాడు.

Munawar Faruqui: మునావర్ షోను రద్దు చేయండి.. ఢీల్లీ పోలీసులకు వీహెచ్‌పీ లేఖ

తన తోటి ఆటగాళ్లకు విషెస్ చెప్పాడు. భవిష్యత్తులో మాత్రం యూఎస్ ఓపెన్‌లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. జకోవిచ్ ప్రపంచ దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్లలో ఒకడు. 21 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందాడు. అనేక వారాలపాటు నెంబర్ 1గా నిలిచాడు.