Tokyo Olympics : చైనా ఖాతాలో తొలి గోల్డ్ మెడ‌ల్..డ్రాగన్ స్టార్ట్ చేసిందిగా..

జపాన్ లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అయిన మరునాడే డ్రాగన్ దేశం అయిన చైనా పతకాల ఖాతా ఓపెన్ చేసింది. తొలి గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది చైనా. ఇక పతకాల పండిస్తామంటున్నారు చైనా క్రీడాకారులు. ఒలింపిక్స్ తొలి గోల్డ్ మెడ‌ల్ చైనా ఖాతాలో వేసుకుని శుభారంభాన్నిచ్చింది.

Tokyo Olympics : చైనా ఖాతాలో తొలి గోల్డ్ మెడ‌ల్..డ్రాగన్ స్టార్ట్ చేసిందిగా..

China Gold

Tokyo Olympics Chinese shooter Yang Qian wins 1st gold :జపాన్ లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అయిన మరునాడే డ్రాగన్ దేశం అయిన చైనా పతకాల ఖాతా ఓపెన్ చేసింది. తొలి గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది చైనా. ఇక పతకాల పండిస్తామంటున్నారు చైనా క్రీడాకారులు. ఒలింపిక్స్ తొలి గోల్డ్ మెడ‌ల్ చైనా ఖాతాలో వేసుకుని శుభారంభాన్నిచ్చింది.

శ‌నివారం జ‌రిగిన మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో చైనాకు చెందిన యాంగ్ కియాన్ గోల్డ్ మెడ‌ల్ గెలిచుకుంది. చివ‌రి వ‌ర‌కూ హోరాహోరీగా సాగిన ఈ ఈవెంట్‌లో ర‌ష్యా షూట‌ర్ అన‌స్తేసియా గ‌లేషినా సిల్వ‌ర్‌తో స‌రిపెట్టుకోగా…లాస్ట్ షాట్ లో అన‌స్తేసియా గ‌లేషినా అధిగ‌మించి చైనా అమ్మాయి యాంగ్ కియాన్ గోల్డ్ గెలిచేసుకుంది. ఒలింపిక్ రికార్డ్ స్కోరు అయిన 251.8 సాధించ‌డం విశేషం.

చైనా గోల్డ్ మెడల్ తో మిగతా దేశాలకు సవాల్ విసురుతుంటే భారత్ బేజారెత్తుతోంది. తొలిలోనే తడబడింది.ఈ ఒలింపిక్స్‌లో ఇండియాకు మెడ‌ల్ ఆశ‌లు రేపిన గేమ్స్‌లో షూటింగ్ కూడా ఒక‌టి. కానీ తొలి ఈవెంట్‌లోనే తీవ్రంగా నిరాశ‌పడ్డారు మ‌హిళా షూట‌ర్లు. 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఇండియ‌న్ షూటర్లు ఇద్ద‌రు ఉన్నా.. క‌నీసం ఫైన‌ల్ కూడా చేరుకోలేక‌చతికిలపడ్డారు. ఎన్నో ఆశ‌లు రేపిన ఎల‌వ‌నిల్ వ‌ల‌రివ‌న్‌, సీనియ‌ర్ అపూర్వి చండీలా ఇద్ద‌రూ ఫైన‌ల్‌కు క్వాలిఫై కూడా కాలేక‌పోవటం విచారించాల్సిన విషయం. ఎలవ‌నిల్ 626.5 పాయింట్ల‌తో 16వ స్థానంలో నిల‌వ‌గా.. అపూర్వి చండీలా 621.9 పాయింట్ల‌తో 36వ స్థానంతో స‌రిపెట్టుకుంది.

అటు చైనా గోల్డ్ మెడల్ తో శుభారాంభాన్ని ఇస్తే..మరోవైపు గ‌లేషినా 251.1 పాయింట్ల‌తో తృటిలో గోల్డ్ మిస్స‌యింది. ఇక స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన నినా క్రిస్టెన్ 230.6 పాయింట్ల‌తో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచింది. యాంగ్‌కు గోల్డ్ మెడ‌ల్‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ ప్రెసిడెంట్ థామ‌స్ బాక్ బ‌హూకరించారు. ఈసారి పోడియంపై కూడా మాస్కులు పెట్టుకునే క‌నిపించిన అథ్లెట్లు.. మెడ‌ల్ కూడా ఎవ‌రికి వాళ్లే తీసుకొని మెడ‌లో వేసుకున్నారు. ఇలా చైనా టెక్నాలజీలోనే కాదు ఒలింపిక్స్ లో పతకాలు కూడా మావేనంటోంది.