Omicron : అక్టోబర్ లోనే ఒమిక్రాన్ వ్యాప్తి!

ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" గురించి మరో ముఖ్యమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న దక్షిణాఫ్రికా ప్రకటించే వరకు ఈ వేరియంట్

Omicron : అక్టోబర్ లోనే ఒమిక్రాన్ వ్యాప్తి!

Omicron

Omicron :  ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” గురించి మరో ముఖ్యమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న దక్షిణాఫ్రికా ప్రకటించే వరకు ఈ వేరియంట్ ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి అక్టోబర్ లోనే మొదలైనట్లు తెలుస్తోంది.​ ‘ఒమిక్రాన్​’ను దక్షిణాప్రికా గుర్తించేందుకు కొన్ని వారాల ముందు…నైజీరియాలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారి నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఇద్దరిలో కొత్త వేరియంట్ ఉన్నట్లు​ నిర్ధరణ అయిందని బుధవారం నైజీరియా జాతీయ ప్రజారోగ్య సంస్థ ప్రకటించింది.

ఇక, కొత్త వేరియంట్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలోకి ఒమిక్రాన్​ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్​ తాజాగా ప్రకటించింది. నవంబర్​ 24న కొత్త వేరియంట్​ గురించి WHOకి దక్షిణాఫ్రికా చెప్పిందని.. అయితే తమ దేశంలో గత నెల 19- 23 మధ్య తేదీల్లో సేకరించిన శాంపిల్స్ లో ఒమిక్రాన్​ను గుర్తించినట్టు నెథర్లాండ్స్​ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు, ఇప్పటి వరకు సుమారు 20 దేశాల్లో ఒమిక్రాన్​ వేరియంట్​ వెలుగు చూసింది. సౌదీ అరేబియా,జర్మనీ,ఇజ్రాయెల్,యూకే ,నెదర్లాండ్స్,దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్​వానా, హాంకాంగ్​,ఆస్ట్రేలియాతో పాటు పలు యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు ఒమిక్రాన్ కారణంగా మరణించిన రిపోర్ట్ లు లేవు. ఇక, క్రమంగా ఒక్కోదేశానికి ఒమిక్రాన్​ వ్యాప్తి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ ఆంక్షలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాల్లో లాక్ డౌన్ ను పొడిగించారు.

ALSO READ New Uniform For Indian Army: ఆర్మీకి కొత్త యూనిఫాం!

ALSO READ Omicron Threat : ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన నలుగురికి కరోనా