Omicron : దక్షిణాఫ్రికాలో చిన్నారులకు సోకుతున్న ఒమిక్రాన్!

కొత్తగా వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ మాత్రం ప్రపంచాన్ని మొత్తం కలవర పెడుతోంది. దక్షిణాప్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్..దాదాపు 14 దేశాలకు విస్తరించిందని తెలుస్తోంది.

Omicron : దక్షిణాఫ్రికాలో చిన్నారులకు సోకుతున్న ఒమిక్రాన్!

Omicron

Omicron South Africa : దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ భయపెడుతోంది. ఈ కొత్త వేరియంట్ ప్రపంచదేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పలు దేశాలు కఠిన నియమ, నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రధానంగా సౌతాఫ్రికాలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిన్నారులకు సైతం ఈ వైరస్ సోకుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. చిన్నారులు కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో కేసులు అధికమౌతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ బారిన పడిన చిన్నారులను అధికారులు ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Read More : Google : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తితో గూగుల్ కీలక నిర్ణయం

ముందస్తుగానే..ప్రత్యేక బెడ్లను సిద్ధం చేస్తోంది. చిన్నారులకు వేరియంట్ వ్యాప్తిపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నామని అనుకున్న తరుణంలో కొత్త వేరియంట్ రావడంతో గత రోజులు పునరావృతమౌతున్నాయి. ఎప్పటిలాగానే..కొత్త రూపంలో మార్పు చెందుతోంది. డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ లో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కొత్తగా వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ మాత్రం ప్రపంచాన్ని మొత్తం కలవర పెడుతోంది. దక్షిణాప్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్..దాదాపు 14 దేశాలకు విస్తరించిందని తెలుస్తోంది.

Read More : Santhoshi Matha: సంతోషిమాత ఆలయంలో భారీ చోరీ

దీంతో ఆయా దేశాలు క్రమ క్రమంగా..ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. వారం రోజుల క్రితం వెలుగు చూసిన ఈ వేరియంట్ పై ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. కరోనా నుంచి చేదు అనుభవాల నుంచి ఇంకా పలు దేశాలు తేరుకోలేదు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూస్తున్న కేసులు ఒమిక్రాన్ వల్లేనని ఇంకా నిర్ధారణ మాత్రం కాలేదు. ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నా…బాధితుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. బ్రిటన్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇంగ్లండ్, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్ లలో వేరియంట్ బయటపడింది. భారత్ లోనూ..ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళన మొదలైంది. పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. విదేశీ ప్రయాణీలకును గుర్తించడం, పరీక్షించడం లాంటి కట్టడి చర్యలు మళ్లీ ప్రారంభించారు.