WHO Omicron : జాగ్రత్త.. ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదు

ఈ వైరస్‌లు అంతమయ్యేది ఎప్పుడు? విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం చెప్పింది.

WHO Omicron : జాగ్రత్త.. ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదు

Who Omicron

WHO Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ లు అంతమయ్యేది ఎప్పుడు? విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం చెప్పింది.

Alcohol : మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా? ఇందులో నిజమెంత?

క‌రోనా మ‌హ‌మ్మారిలో ఒమిక్రాన్ వేరియంట్ చివ‌రిది కాద‌ని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఇంకా చాలా వేరియంట్లు ప్ర‌పంచానికి స‌వాల్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించింది. సుమారు 180 దేశాల నుంచి 7 మిలియ‌న్ల శాంపిళ్ల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత ఈ హెచ్చ‌రిక‌లు చేస్తున్న‌ట్టు డ‌బ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో గ‌తంలో చేసిన పొరపాట్లు మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌ని డ‌బ్ల్యూహెచ్ఓ సూచించింది.

కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నా.. అదేమీ అంత సివియర్ కాద‌ని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక దేశాలు ఒమిక్రాన్ ను లైట్‌ తీసుకుంటున్నాయి. కరోనా నిబంధనల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేశారు. భౌతికదూరం, మాస్కు ధరించడం వంటివి పట్టించుకోవడం లేదు.

Amazon Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్స్

దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య‌ సంస్థ కీల‌క హెచ్చ‌రిక చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని, తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని చెప్పి.. ఆ వేరియంట్ ను త‌క్కువ చేసి చూడటం పొర‌పాటే అవుతుంద‌ంది. ఒమిక్రాన్ వేరియంట్ ఎలా విరుచుకుప‌డుతుంతో ఇప్పుడే అంచ‌నా వేయ‌లేమ‌ని ప్ర‌పంచ డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. సార్స్ కోవ్ 2 వైరస్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేశార‌ని, ఆ తర్వాత దాని ప్ర‌భావం ఎలా ఉందో చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ంది డ‌బ్ల్యూహెచ్ఓ. కాబట్టి, కరోనా కొత్త వేరియంట్ ను లైట్ తీసుకోవద్దని, నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది.