జ్యూపిటర్ ఉపగ్రహంపై అక్టోపస్ జీవులు!!

జ్యూపిటర్ ఉపగ్రహంపై అక్టోపస్ జీవులు!!

Jupiter Moon:భూమికి చంద్రుడిలా జ్యూపిటర్‌కు ఉపగ్రహం(యూరోపా) ఉంది. ఇదిలా ఉంటే మనుషులు ఏలియన్ల మనుగడ కోసం తెగ వెదికేస్తున్నారు. స్పేస్ ప్రోగ్రాంస్ చేపట్టి.. కోట్లలో వెచ్చించి జల్లెడపడుతున్నారు. బ్రిటీష్ స్పేస్ సైంటిస్ట్ ప్రొఫెసర్ మోనికా గ్రేడీ అన్ని అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలను రీసెంట్ స్పీచ్ లో బయటపెట్టారు.

జ్యూపిటర్ ఉపగ్రహంపై మనుషులు మనుగడసాగించొచ్చా అనే ప్రయోగాలు చేస్తున్నారు. ఇది అలా ఉండకపోవచ్చు. అక్కడ అక్టోపస్ పోలిన జీవులు.. అక్కడి చల్లని నీళ్లలో తిరుగుతున్నాయి.

లివర్‌పూల్ హోప్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ ఆఫ్ ప్లానెటరీ అండ్ స్పేస్ స్పేన్స్ అండ్ చాన్సిలర్ గ్రేడీ మన గెలాక్సీలో మనిషి మనుగడ ఇంకెక్కడ సాధ్యపడుతుందో కనుక్కోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మార్స్ పై ఉన్న లోతైన గుహల్లో దాక్కొని జీవులు స్వేచ్ఛగా బతుకుతున్నాయి. సోలార్ రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి బ్యాక్టీరియా లాంటివి అలా పారిపోతుంటాయి. అక్కడ ఉన్న ఐస్ వల్ల నీరు దొరికే అవకాశాలు ఉన్నాయి. భూమి నుంచి 390మిలియన్ల దూరంలో ఉన్న యూరోపా వాతావరణ పరిస్థితుల్లో మార్షియన్ బ్యాక్టీరియా కంటే అధునాతన టెక్నిక్‌లు అక్టోపస్ తెలివితేటల ముందు తక్కువే.

నిజానికి ఈ అక్టోపస్ లు జ్యూపిటర్ ఉపగ్రహంపై ఎక్కడుంటాయో తెలుసా.. ఎక్కడైతే మందపాటి ఐస్ గడ్డకట్టి పోయి ఉంటుందో అక్కడే.. కొన్ని ప్రదేశాల్లో 15మైళ్ల దూరం లోతులో. అక్కడున్న ఐస్ మొత్తం నుంచి వాటర్ గా మార్చుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అక్కడితలాన్ని బట్టి హైడ్రోథర్మల్ వెంట్స్ ఉన్నట్లు కనిపిస్తుందని సమాచారం.