Onam At Antarctica : అంటార్కిటికా మంచు మీద ఓనమ్​ ముగ్గు .. దటీజ్ ఇండియన్స్ అంటున్న ఆనంద్ మహీంద్రా

అంటార్కిటికా మంచు మీద ఓనమ్​ ముగ్గు చెక్కారు కొంతమంది యువకులు. దటీజ్ ఇండియన్స్ అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.

Onam At Antarctica : అంటార్కిటికా మంచు మీద ఓనమ్​ ముగ్గు .. దటీజ్ ఇండియన్స్ అంటున్న ఆనంద్ మహీంద్రా

Onam At Antarctica

Onam At antarctica : ఓనమ్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది దేవభూమిగా పేరొందని కేరళ. కేరళవాసులకు చాలా పెద్ద పండుగ ఓనమ్. ఓనమ్ పండుగకు ఓ ప్రత్యేకమైన ముగ్గు వేస్తారు కేరళ మహిళలు. అటువంటి ఓనమ్ ముగ్గు ముంచు ఖండం అయిన అంటార్కిటికాలో ప్రత్యక్షమైంది. కేరళ ఎక్కడ? అంటార్కిటికా ఎక్కడ? అంటార్కిటికాలో ఓనమ్ ముగ్గు ఏంటీ అనే డౌట్ వస్తుంది. భారతదేశ ప్రజలు ఎక్కడున్నా తమ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోరు. అమెరికాలో ఉన్నా..అలాస్కాలో ఉన్నా..ఆఖరికి అంటార్కిటికాలో ఉన్నా తమ సంప్రదాయాన్ని చాటి చెబుతుంటారు. అటువంటి సంప్రదాయం ఓనమ్ ను అంటార్కిటికా మంచుమీద ప్రతిబింభించారు కొంతమంది యువకులు. అంటార్కిటా మంచుమీద ‘ఓనమ్’ముగ్గును చెక్కారు కొంతమంది యువకులు.

Onam celebrations in Antarctica: Anand Mahindra calls viral video  'Outstanding' | Latest News India - Hindustan Times

కేరళ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఓనమ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మనం సంక్రాంతికి ముగ్గులు వేసినట్టుగా వాళ్లు ఓనమ్ సందర్భంగా వివిధ డిజైన్లు, రంగుల్లో రంగోలీలను వేసుకుంటూ ఉంటారు.అలా అంటార్కిటికాలో గడ్డ కట్టిన మంచు మీద రంగోలి ముగ్గును చెక్కిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆనంద్ మహేంద్రా పోస్ట్ చేయటం అది వైరల్ కాకపోవటమూనా..నెవ్వర్..అలాగే ఈ అంటార్కిటికాలో ఓనమ్ ముగ్గు వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.

సుత్తెలు, స్క్రూ డ్రైవర్లతో..అంటార్కిటికాలో ప్రత్యక్షమైన ఓనమ్..
అంటార్కిటికాలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి. మంచు బాగా గడ్డకట్టి శరీరంలో రక్తం కూడా గడ్డకట్టిపోయేంత చలి ఉంటుంది. అటువంటి అంటార్కిటికాలోని ఓ సరస్సులాంటి దానిపై గడ్డకట్టిన మంచుపై కొందరు యువకులు ఓనమ్ ముగ్గును చెక్కారు. చిన్న సుత్తి, స్క్రూ డ్రైవర్లను ఉపయోగించి ఓనమ్ ముగ్గును చెక్కారు. అంతా కలిసి చెక్కినా ఎక్కడా ఆకారం ఎక్కడా చెక్కు చెదరకుండా చక్కగా అద్భుతంగా చిత్రీకరించారు. దాని కింద ఓనమ్ ఎట్ అంటార్కిటికా అనే అక్షరాలనూ చెక్కారు. చివరికి అంతా కలిసి ఆ ముగ్గు దగ్గర నిలబడి ఫొటోలకు పోజిచ్చారు.

అంటార్కిటికా మంచు మీద ఓనమ్​ ముగ్గు.. ఆనంద్​ మహీంద్రా షేర్​ చేసిన వీడియో  ఇదిగో

దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయులు ఓనమ్ పండుగను జరుపుకోకుండా ఆపలేం. అది అంటార్కిటికా అయినా సరే. చాలా బాగా రంగోలీ వేశారు..’ అని కామెంట్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి లక్షల కొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి.‘భారతీయులు అంటార్కిటికాలోనే కాదు చందమామపైనా ఓనమ్ పండుగను జరుపుకొనే సమయం దగ్గరలోనే ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.