Remove CO2 from Air: ఈ ప్రాజెక్టుతో గాల్లోని మిలియన్ టన్నుల CO2 మాయం

ప్రజా శ్రేయస్సు కోసం స్కాట్‌లాండ్.. భారీ ప్రాజెక్టు రెడీ చేయనుంది. దాదాపు 400లక్షల చెట్లు చేసే పనిని ఒక్క బిల్డింగ్ నిర్మాణంతో పూర్తి చేయనున్నారు. 2026 నాటికి సిద్ధం కానున్న ప్రాజెక్టు స్కాటిష్ దేశ ఆరోగ్యాన్ని...

Remove CO2 from Air: ఈ ప్రాజెక్టుతో గాల్లోని మిలియన్ టన్నుల CO2 మాయం

Co2

Remove CO2 from Air: ప్రజా శ్రేయస్సు కోసం స్కాట్‌లాండ్.. భారీ ప్రాజెక్టు రెడీ చేయనుంది. దాదాపు 400లక్షల చెట్లు చేసే పనిని ఒక్క బిల్డింగ్ నిర్మాణంతో పూర్తి చేయనున్నారు. 2026 నాటికి సిద్ధం కానున్న ప్రాజెక్టు స్కాటిష్ దేశ ఆరోగ్యాన్ని కాపాడేవిధంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతగా ప్రయత్నించినా వాతావరణ పరిస్థితులను మార్చలేం. చారిత్రక స్థాయి 1.2డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే దాటేసి వాతావరణమంతా కర్బన వ్యర్థాలతో నిండిపోయింది. దానిని అదుపులోకి తీసుకురావాలంటే.. సీసీఎస్ (కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్) పద్ధతి వాడాల్సిందే అంటున్నారు సైంటిస్టులు.

ప్రధాని అంగీకారం:
పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు విడుదల చేసే వ్యర్థభరితమైన నూనెల్లో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. దానిని నేలలోనే నిల్వ చేసే ప్రక్రియను చేపట్టనున్నారు. వాతావరణం పాడవకుండా చేపట్టే ఈ భారీ ప్రాజెక్టు కోసం 1.4బిలియన్ డాలర్ల పబ్లిక్ ఫండ్ ను కేటాయించేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకారం తెలిపారు.

ఎందుకంటే:
గ్రీన్ ఇండిస్ట్రియల్ రివొల్యూషన్ పథకంతో టెక్నాలజీలో యూకే వరల్డ్ లీడర్ గా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్టుతో వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కొత్త మాసివ్ కార్బన్ స్టోరేజి ప్లాంట్ కోసం స్కాట్‌లాండ్ కు భారీగా నిధులు అవసరం అవుతాయని అన్నారు.

400లక్షల చెట్లు తొలగించే:
గాలి కాలుష్యాన్ని, కర్బన్ వ్యర్థాలని తగ్గించే దిశగా ఎలక్ట్రిక్ కార్లు లాంటి వంటివి వాడాలని ప్రభుత్వం సూచిస్తుంది. అయినప్పటికీ కర్బన్ వ్యర్థాలను తొలగించడానికి ఇంకా చేయాల్సి ఉంది అని కార్బన్ ఇంజినీరింగ్ సీఈఓ స్టీవ్ అంటున్నారు. ఈ ఫెసిలిటీతో మనం సంవత్సరానికి 400లక్షల చెట్లు తొలగించగల కార్బన్ డై ఆక్సైడ్‌ను అరికట్టవచ్చు.

ఎలా జరుగుతుంది:
సీసీఎస్ సిస్టమ్‌లో.. ఫ్యాన్ ను అమర్చడంతో లిక్విడ్ మిక్చర్ లో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను శోషించుకుంటుంది. అప్పుడే కాల్షియం కార్బొనేట్ గుళికలుగా మారుస్తుంది. వాటిని 900డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ వేడి చేస్తారు. ఆ స్థాయిలో కార్బన్ డై ఆక్సైడ్ ను కాల్షియం ఆక్సైడ్ గా మార్చేస్తుంది. ఆ తర్వాత దానిని నేలలో ఇంకిపోయేలా చేస్తారు. లేదంటే కమర్షియల్ యూజ్ కోసం విక్రయిస్తారు.