Data Charges : మూడు రూపాయలకే వన్ జీబీ డేటా.. చైనా కంటే ఈ దేశం నయం

ప్రపంచంలో అతితక్కువ ధరలకు డేటా అందిస్తున్న టాప్ 10 దేశాల జాబితాలో భారత్ తోపాటు, చైనా అమెరికాలకు చోటు దక్కలేదు. ఈ మూడు దేశాల్లో ఒక జీబీ డేటా ఖరీదు రూ.50కి పైనే ఉంది. ఇక అతితక్కువ ధరకే డేటాను ఇజ్రాయిల్ అందిస్తుంది.

Data Charges : మూడు రూపాయలకే వన్ జీబీ డేటా.. చైనా కంటే ఈ దేశం నయం

Data Rates

Data Charges :  ఈ మధ్యకాలంలో ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోనే కనిపిస్తుంది. ఇక స్మార్ట్ ఫోన్ ఉందంటే ఇంటర్ నెట్ తప్పనిసరి.. లేదంటే ఆ ఫోన్ ఉండి ఉపయోగం లేనట్లే. ఏదైనా తెలుసుకోవాలి అంటే టక్కున తీసేది స్మార్ట్ ఫోనే.. ఇక స్మార్ట్ ఫోన్ లో సమాచారం తెలుసుకోవాలంటే ఇంటర్ నెట్ తప్పనిసరి.. ఇక ఇప్పుడంటే దేశంలో ఇంటర్ నెట్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ 2016కు ముందు భారత్ లో ఇంటర్ నెట్ చాలా ఎక్కువ ధర ఉండేది. జియో వచ్చిన తర్వాత మొత్తం మార్చిపడేసింది. 2016 ముంది ఒక జీబీ డేటా రూ.200 వరకు ఉండేంది. జియో దెబ్బకు టెలికాం కంపెనీలు రేట్లను తగ్గించక తప్పలేదు.

ఇక ఇదిలా ఉంటే అతి తక్కువ ధరకే డేటాను అందిస్తున్న దేశాలు ఏవీ? అనే అంశాలపై 221 రీజియన్లలో 6,148 మొబైల్‌ డేటా ప్లాన్లు పరిశీలించి తేల్చిన వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ లో ఒక జీబీ డేటా రూ.50కి లభిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక పక్కనున్న శ్రీలంకలో ఒక జీబీ డేటా రూ.28కె లభిస్తుంది. బంగ్లాదేశ్ లో ఒక జీబీ డేటా రూ.25 గా ఉంది.

ఇజ్రాయిల్‌లో ఇంటర్నెట్ ను చాలా తక్కువ ధరకు అందిస్తుంది. ఇజ్రాయిల్‌ ప్రజలు వన్‌ జీబీ డేటా కోసం రీఛార్జ్‌పై చేస్తున్న ఖర్చు కేవలం రూ.3 మాత్రమే. ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సర్వీసులు అందిస్తున్న దేశంతా ఇజ్రాయిల్‌ రికార్డ్‌ సృష్టించింది. ఆ తర్వాత కిర్కిజిస్తాన్‌ రూ. 13, ఫిజీ రూ. 18, ఇటలీ రూ, 20. సుడాన్‌ రూ, 20, రష్యా రూ. 21, మోల్డోవా దీవీ రూ. 23, చీలీలో రూ. 29 వంతున ఒక జీబీ డేటాపై ఛార్జ్‌ చేస్తున్నారు.

ఇక తక్కువ ధరకు డేటాను అందిస్తున్న టాప్ 10 దేశాల్లో ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికాకు స్థానం దక్కలేదు. అంతే కాదు అత్యధిక జనాభా ఉన్న చైనా కూడా టాప్ టెన్ లో చోటుదక్కించుకోలేక పోయింది. ఇక భారత్ లో కూడా రూ.50 రూపాయలు ఉండటంతో
డేటా ధర తక్కువ ఉన్న టాప్ 10 దేశాల్లో చోటుదక్కించుకోలేక పోయింది.