Eggs Side Effect: గుడ్లు తింటే బలంతో పాటు బాధలూ తప్పవు

 మిడిల్ క్లాస్ వారంతా ప్రొటీన్ కావాలనో.. హెల్తీగా ఉండాలనో ట్రై చేసేందుకు వాళ్ల మొదటి ఆప్షన్ గుడ్డుయే. యాంటీ ఆక్సిడెంట్లు, అత్యవసరమైన మినరల్స్, ఎమినో యాసిడ్స్ లు ఉండటమే కాకుండా..

Eggs Side Effect: గుడ్లు తింటే బలంతో పాటు బాధలూ తప్పవు

Egg Side Effects

Eggs Side Effect: మిడిల్ క్లాస్ వారంతా ప్రొటీన్ కావాలనో.. హెల్తీగా ఉండాలనో ట్రై చేసేందుకు వాళ్ల మొదటి ఆప్షన్ గుడ్డుయే. యాంటీ ఆక్సిడెంట్లు, అత్యవసరమైన మినరల్స్, ఎమినో యాసిడ్స్ లు ఉండటమే కాకుండా.. కొవ్వుతో పోరాడే కోలిన్, ఎముకలను బలపరిచే విటమిన్ డీ, బ్రెయిన్ ను బూస్ట్ చేసే విటమిన్ బీ12 లాంటివి దొరుకుతాయి. చాలా స్టడీల్లో గుడ్లు ఎనర్జీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా, ఇమ్యూన్ సిస్టమ్ కు సపోర్ట్ చేస్తుందని వెల్లడైంది.

ఇంకా గుడ్లు తినడం వల్ల కళ్లకు, చర్మానికి, జుట్టుకు మంచిదే కాకుండా.. ఇంకా ఎన్నో సూపర్ పవర్స్ ఉన్నాయని స్పష్టమైంది. నిజాయతీగా చెప్పాలంటే గుడ్లు చేయలేనిది ఇంకేముంది. వాటిని ఫ్రై చేసుకుని తిన్నా, గుడ్డు సొనతో ఆమ్లెట్ వేసుకున్నా, ఉడకబెట్టుకుని తిన్నా పాజిటివ్ అంశాలతో పాటు ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది మరి. గుడ్డు మీ కొలెస్ట్రాల్ ప్రొఫైల్ పై ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా..

కొలెస్ట్రాల్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ అంశం. కొన్ని స్టడీల్లో అది గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందని తేలింది. మరో స్టడీలో వారానికి అర డజను గుడ్లు తిన్నా సమస్య ఉండదని తెలిసింది.

జేఏఎమ్ఏ 2019 స్టడీ ప్రకారం.. వారానికి మూడు నుంచి నాలు గుడ్లు తినడం వల్ల కార్డియోవాస్క్యూలర్ జబ్బు (సీవీడీ) లాంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. రోజుకు అరగుడ్డు చొప్పున తిన్నా 6శాతం రిస్క్ పెరుగుతుందట.

ఒక పూర్తి గుడ్డులో 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. హార్వార్డ్ హెల్త్ ప్రకారం.. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది చెడు ప్రభావం చూపిస్తుంది. ఎలాగంటే ఆర్టిరీ వాల్స్ ను కొవ్వు అణువులతో బ్లాక్ చేసేస్తుంది కాబట్టి. ఎల్డీఎల్ పెద్ద అణువులు గుండె జబ్బుల రిస్క్ ను పెంచేస్తుంది. గుడ్లు ఎల్డీఎల్ పార్టికల్స్ పరిమాణాన్ని పెంచేయడంతో అవి మరింత హానిని చేస్తాయి.

ఆరోగ్యవంతులు రోజుకు ఒకటి చొప్పిన వారమంతా గుడ్డు తిన్నా సమస్యలు రావని తెలిసింది. అలా కాకుండా కొలెస్ట్రాల్ తగ్గించాలని ఫీల్ అయితే అందులో పచ్చ సొన తినకపోవడం ఉత్తంమ. అంతకుమించి తినడానికి ప్రయత్నిస్తే గుండె జబ్బుల సమస్యలు ఎదుర్కొనాల్సిందే. ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటే అందులో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ ఉండి కేవలం ప్రొటీన్ మాత్రమే ఉంటుంది.