US Lottery Winner: అమెరికా చరిత్రలో అతిపెద్ద లాటరీ.. రూ.16 వేల కోట్ల ప్రైజ్ మనీ.. గెలుచుకుందెవరో తెలుసా?

అమెరికాలోని దాదాపు 45 రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా లాటరీ నిర్వాహకులు పవర్ బాల్ జాక్‌పాట్ పేరుతో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో ఒక్క టిక్కెట్ ఖరీదు రెండు డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.160. లాటరీ మొత్తం ఎంత అనేది ముందు తెలియదు. టిక్కెట్ల అమ్మకాలు, పోటీ వంటి అనేక అంశాల ఆధారంగా లాటరీ మొత్తాన్ని నిర్వాహకులు నిర్ణయిస్తారు.

US Lottery Winner: అమెరికా చరిత్రలో అతిపెద్ద లాటరీ.. రూ.16 వేల కోట్ల ప్రైజ్ మనీ.. గెలుచుకుందెవరో తెలుసా?

US Lottery Winner: గత నవంబర్‌లో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద లాటరీని నిర్వాహకులు ప్రకటించారు. అప్పటి నుంచి విజేత గురించిన వివరాల్ని వెల్లడించకుండా దాచారు. తాజాగా అతడి వివరాల్ని నిర్వాహకులు వెల్లడించారు. ఆ లాటరీ విజేత పేరు ఎడ్విన్ క్యాస్ట్రో.

Chetan Sharma: కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విబేధాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెల్లడించిన చేతన్ శర్మ

ఇంతకీ అతడు గెలుచుకుంది ఎంతో తెలుసా.. 2.04 బిలియన్ డాలర్లు. అంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.16,590 కోట్లు. విజేతకు సంబంధించిన వివరాల్ని ఇంతకాలం దాచి ఉంచారు. తాజాగా అక్కడి నిబంధనల ప్రకారం విజేత వివరాల్ని నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. అమెరికాలోని దాదాపు 45 రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా లాటరీ నిర్వాహకులు పవర్ బాల్ జాక్‌పాట్ పేరుతో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో ఒక్క టిక్కెట్ ఖరీదు రెండు డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.160. లాటరీ మొత్తం ఎంత అనేది ముందు తెలియదు. టిక్కెట్ల అమ్మకాలు, పోటీ వంటి అనేక అంశాల ఆధారంగా లాటరీ మొత్తాన్ని నిర్వాహకులు నిర్ణయిస్తారు.

V Hanumantha Rao: మోదీ పాలన నియంతను తలపిస్తోంది.. మీడియాపై దాడులు సరికాదు: వీహెచ్

దీని ప్రకారం ఈ సారి రూ.16,590 కోట్ల లాటరీగా నిర్ణయించారు. క్యాలిఫోర్నియా నిబంధనల ప్రకారం.. లాటరీ విజేతల వివరాల్ని బహిరంగపర్చాలి. లాటరీ గెలిచిన వ్యక్తి, టిక్కెట్ నెంబర్, టిక్కెట్ కొనుగోలు చేసిన ప్రదేశం, అతడి వివరాలు, గెలిచిన మొత్తం వంటివి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నిబంధనకు అనుగుణంగా అతడి పేరును ఎడ్విన్ క్యాస్ట్రోగా తెలిపారు. అంతకుమించిన వివరాల్ని నిర్వాహకులు వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఎడ్విన్ గత నవంబర్‌లో టిక్కెట్ కొనుగోలు చేశాడు. బహుమతి మొత్తాన్ని దశలవారీగా ఇస్తారు. ఒకేసారి కావాలంటే తక్కువ మొత్తాన్ని అందిస్తారు.

Valentine’s Day: వాలెంటైన్స్ డే జరుపుకొనేందుకు గోవా వెళ్లిన జంట.. నీళ్లలో మునిగి ప్రేమికులు మృతి

అయితే, ఎడ్విన్ తక్కువ మొత్తం ఒకేసారి తీసుకునేందుకే సిద్ధపడ్డాడు. దీంతో అతడు 997 మిలియన్ డాలర్లు ఒకేసారి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అతడి వివరాల్ని పూర్తిగా చెప్పలేమని, అతడు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదని నిర్వాహకులు అన్నారు. నిబంధనల ప్రకారం.. లాటరీ విజేతను ప్రకటించిన ఏడాదిలోపు లాటరీ మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎడ్విన్ నిర్ణీత గడువులోపే బహుమతి మొత్తాన్ని అందుకున్నాడు. ఎడ్విన్.. తాను లాటరీ గెలిచిన విషయం తెలియగానే షాక్‌కు గురయ్యాడని నిర్వాహకులు చెప్పారు.