బ్రెగ్జిట్ వద్దు…జనసముద్రంలా లండన్ వీధులు

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2019 / 02:53 PM IST
బ్రెగ్జిట్ వద్దు…జనసముద్రంలా లండన్ వీధులు

బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనకారులు వ్యతిరేకించారు.బ్రిటన్ లోని అన్ని ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.బ్రిటన్ లో నివసిస్తున్న యూరోపియన్ యూనియన్ దేశస్థులు కూడా పలువురు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.ప్రధాని థెరిసా మే రాజీనామా చేయాలంటూ డిమాండ్ లు వినిపిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు ఈయూ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనలు తెలిపారు.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోకుండా ఉండే డీల్ బెస్ట్ డీల్ అంటూ ప్లకార్డులతో నిరసనలు తెలిపారు.అన్ని పార్టీలకు చెందిన సీనియర్ లీడర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.ఇప్పటికే రెండు సార్లు పార్లమెంట్‌ తిరస్కరణకు గురైన ప్రధాని బ్రెగ్జిట్ ఒప్పందంపై వచ్చేవారంలో మూడోసారి ఓటింగ్‌ జరిగే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే బ్రెగ్జిట్‌ గడువును పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామంటూ యురోపియన్ యూనియన్ ప్రతిపాదించింది.రెండు సార్లు బ్రిటన్ పార్లమెంట్ లో వీగిపోయిన ఈ ఒప్పందం విషయంలో తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వాలంటూ ఎంపీల నుండి ఎదురవుతున్న వత్తిడికి తలోగ్గిన ప్రభుత్వం వచ్చే వారం ఓటింగ్‌ నిర్వహించేందుకు రెడీ అయింది.