Indonesia New Law : పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష.. ఇండోనేషియా కొత్త చట్టం!

పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియాలో కొత్త చట్టం రానుంది. దీనికి సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం ముసాయిదా బిల్లు సిద్దమైంది. త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.

Indonesia New Law : పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష.. ఇండోనేషియా కొత్త చట్టం!

Indonesia's new law

Indonesia New Law : పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియాలో కొత్త చట్టం రానుంది. దీనికి సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం ముసాయిదా బిల్లు సిద్దమైంది. త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. గతంలో దీనిపై డ్రాఫ్ట్ బిల్లును తీసుకురావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి.

పెళ్లికి ముందు సెక్స్.. రేప్‌ చేసినట్లే : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

బిల్లు తమ స్వేచ్ఛ హక్కును హరిస్తుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్సుడు కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇండోనేషియా విలువలను రక్షించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు డిప్యూటీ న్యాయమంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారియేజ్ తెలిపారు.