Covid Vaccnation: రెండు డోసులు వేసుకున్నాక 10వేల మందిలో నలుగురికే ఇన్ఫెక్షన్

కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అద్భుతమైన ఫలితాలు ...

Covid Vaccnation: రెండు డోసులు వేసుకున్నాక 10వేల మందిలో నలుగురికే ఇన్ఫెక్షన్

Only 2 4 Per 10k Found Infected After 2 Doses

Covid Vaccnation: కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు ఐసీఎమ్మార్ చెప్తుంది. 10వేల మందికి వ్యాక్సిన్ వేస్తే అందులో కేవలం 2 నుంచి నలుగురికి మాత్రమే ఇన్ఫెక్షన్ కు గురయ్యారని చెప్పింది.

ఐసీఎమ్మార్ డైరక్టర్ బలరామ్ భార్గవ వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ గురించి చెప్పతూ.. వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి అయిన వారు కేవలం 0.04శాతం మంది మాత్రమే ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. కొవాగ్జిన్ వేసుకున్న కంటే కొవీషీల్డ్ వేసుకున్న వారిలో ఇంకా మెరుగైన ఫలితాలు ఉన్నాయి.

దాని కంటే ముందు శానిటైజేషన్, మాస్క్ లు విస్మరించకూడదని వ్యాక్సిన్ వేసుకున్నా తప్పనిసరిగా పాటించాలని చెబుతుననారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న వారిలో చావు రేటు అనేది చాలా తక్కువగా ఉంది.

హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లలో ఇవి గమనించాం. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారిన తరుణంలో వ్యాక్సినేషన్ తప్పకుండా వేయించుకోవాలి. కొవాగ్జిన్ 1.1 కోట్ల డోసులు, 11.6 కోట్ల డోసుల కొవీషీల్డ్ లతో వ్యాక్సినేషన్ జరిగింది.