Romania Operation Ganga : రొమేనియా నుంచి ముగిసిన ఆపరేషన్ గంగ.. 7,457 మంది స్వదేశానికి

రొమేనియా నుంచి మొత్తం 7వేల 457 మందిని భారత్ కు తరలించారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి..(Romania Operation Ganga)

Romania Operation Ganga : రొమేనియా నుంచి ముగిసిన ఆపరేషన్ గంగ.. 7,457 మంది స్వదేశానికి

Romania Operation Ganga

Romania Operation Ganga : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఆపరేషన్ గంగ. ఇందులో భాగంగా యుక్రెయిన్ సరిహద్దు దేశాల్లో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం.(Romania Operation Ganga)

కాగా, రొమేనియా నుంచి ఆపరేషన్ గంగ ముగిసింది. రొమేనియా నుంచి 155 మందితో చివరి విమానం ఢిల్లీ బయలుదేరింది. ఇందులో భారత పౌరులతో పాటు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. రొమేనియా నుంచి మొత్తం 7వేల 457 మందిని భారత్ కు తరలించారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి వారం రోజులుగా రొమేనియాలో ఉండి సహాయక చర్యలను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా పర్యవేక్షించారు.

యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాల్లో ఇప్పటివరకు దాదాపు 16వేల మందిని స్వదేశానికి సురక్షితంగా తరలించామని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ఆదివారం 11 విమానాల్లో మొత్తం 2135 మంది భారత్‌ చేరుకున్నట్లు వెల్లడించింది. మరో 8 విమానాలు చేరుకుంటాయని.. వాటిలో 1500 మందికిపైగా భారతీయులు స్వదేశానికి రానున్నట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది.

Telugu Students Ukraine : యుక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు.. ఒక్కరోజే 244మంది రాక

రష్యా సైనిక చర్య కారణంగా యుక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22 నుంచి భారతీయుల తరలింపు కోసం కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ‘ఆపరేషన్‌ గంగ’ ద్వారా శనివారం నాటికి 66 ప్రత్యేక విమానాల్లో 13,852 మంది భారత్‌కు చేరుకున్నారు. ఆదివారం 11 విమానాల్లో మరో 2135 మంది వచ్చారు. దీంతో యుక్రెయిన్‌ నుంచి ఇప్పటివరకు స్వదేశానికి చేరుకున్న భారత పౌరుల సంఖ్య 15,900 దాటిందని పౌర విమానయానశాఖ వెల్లడించింది. అక్కడే ఉండిపోయిన మరో 2వేల మందిని తీసుకొచ్చేందుకు 10 వాయుసేన విమానాలు ఆయా దేశాలకు బయలుదేరాయంది.

ఆదివారం భారత్‌కు చేరుకున్న మొత్తం 11 విమానాల్లో తొమ్మిది ఢిల్లీ చేరుకోగా.. రెండు ముంబైకి వచ్చాయి. వాటిలో ఆరు విమానాలు బుడాపెస్ట్‌ నుంచి, రెండు పొలాండ్‌, మరొకటి స్లొవేకియా నుంచి భారత్‌ చేరుకున్నాయి.

యుక్రెయిన్‌లో సైనిక చర్య మొదలైనప్పటి నుంచి మొత్తం 21వేల మంది భారతీయులు ఆ దేశ సరిహద్దు వీడినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. వారందరినీ యుక్రెయిన్‌ సరిహద్దు దేశాలైన రొమేనియా, పొలండ్‌, హంగరీ, స్లోవేకియా దేశాల నుంచి ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం ద్వారా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తున్నారు. పౌరులు, విద్యార్థులు క్షేమంగా తిరిగి స్వదేశానికి చేరుకోవడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మిగిలిన పౌరులను, విద్యార్థులను త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు. యుక్రెయిన్ నుంచి స్వదేశానికి సేఫ్ గా చేరుకుంటున్న వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలతో బయటపడతామని, మళ్లీ ఇంటికి వస్తామని అనుకోలేదని కొందరు అన్నారు. తమను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Operation Ganga : యుక్రెయిన్ నుంచి మనోళ్లు మరింత మంది వచ్చేశారు

యుక్రెయిన్ పొరుగు దేశాల నుంచి భారత పౌరులు, విద్యార్థులు విమానాల ద్వారా వచ్చారు. బుకారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగేరీ), ర్జెస్జో (పోలాండ్), కోసీస్ (స్లోవేకియా), సుసెవా (రొమేనియా) నుండి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది.

యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా మళ్లీ ఫోకస్ పెంచింది. కీవ్‌తో పాటు రాజధాని సమీప ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా దాడులు చేస్తోంది. కీవ్ మిలటరీ ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిపించింది రష్యా. అటు యుక్రెయిన్‍‌ నగరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. రోజుకు సగటున 25కు పైగా మిస్సైల్ దాడులతో యుక్రెయిన్‌ మొత్తాన్ని షేక్ చేస్తోంది. యుక్రెయిన్‌లో ఇప్పటివరకు 500లకు పైగా మిస్సైల్స్‌ను ప్రయోగించింది రష్యా.