ఓసామాబిన్ లాడెన్ అమరవీరుడంటూ పార్లమెంట్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు

  • Published By: madhu ,Published On : June 26, 2020 / 04:34 AM IST
ఓసామాబిన్ లాడెన్ అమరవీరుడంటూ పార్లమెంట్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అమరుడు అంటూ ప్రశంసించడం హాట్ టాపిక్ అయ్యింది. పార్లమెంట్ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి.

బిన్ లాడెన్ ను పొడగడం ఇదే మొదటిసారి కాదు..ప్రధాని కాకముందు కూడా పలు వ్యాఖ్యలు చేశారు. లాడెన్ ను ఉగ్రవాది అంటే ఒప్పుకోనని, బ్రిటన్ కు మాత్రమే ఆయన ఉగ్రవాది అని..మిగతా వారికి కాదన్నారు. లాడెన్ దాకొన్న ప్రదేశాన్ని తాము అమెరికాకు చెప్పామని, కానీ..చంపేందుకు ఆపరేషన్ ను చేపట్టకూడదన్నామన్నారు.

అయినా..లాడెన్ ను అమెరికా సైన్యం చంపేసిందన్నారు. అమెరికా బలగాలు అబోటాబాద్ వచ్చి లాడెన్ ను చంపినప్పుడు తాము చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఓ ఉగ్రవాదిని అమరవీరుడంటూ ప్రశసించడంపై ఇమ్రాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాడెన్ ఎలా పొగుడుతారని పాక్ ముస్లిం లీగ్ నేత, విదేశాంగ మాజీ మంత్రి క్వాజా ఆసిఫ్ ప్రశ్నించారు.

2001లో అతడి ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చెందిన ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చేశారు. అందులో 3 వేల మంది చనిపోగా.. 25వేలకు పైగా గాయపడ్డారు. దీంతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఈ దాడుల అనంతరం బిన్ లాడెన్ చంపేయడానికి అమెరికా ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు 2011, మే 05వ తేదీన అబోటాబాద్ లో గుర్తించి..లాడెన్ ను చంపేశారు. 

Read:  భారత్ కు అమెరికా అండ..బలగాల మోహరింపు