Oscars 2020 winners list : 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

  • Published By: sreehari ,Published On : February 10, 2020 / 01:59 AM IST
Oscars 2020 winners list : 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో 92వ ఆస్కార్ అవార్డుల 2020 ప్రదానోత్సవం జరుగుతోంది. ఈ ఏడాదిలో ఆస్కార్ అవార్డులకు నామినెట్ అయిన వారి జాబితా విడుదల అవుతోంది. అస్కార్ 2020 విజేతల జాబితాలో అత్యధికంగా నామినెట్ అయిన ఫిల్మ్ జోకర్. 11 ఆస్కార్ నామినేషన్లలో జోకర్ జాక్ పాట్ కొట్టేసింది.

జోకర్ తర్వాత 1917 మూవీ, ది ఐరీష్ మ్యాన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ మూవీతో పాటు ఒక్కొక్కటిగా 10వరకు నామినేషన్లలో ఉన్నాయి. ఇందులో తొమ్మిది చిత్రాలు బెస్ట్ ఫిల్మ్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. నామినేషన్ల జాబితాలో ఫోర్డ్ వి ఫెరాయి, ది ఐరీష్ మ్యాన్, జోకర్, 1917, మ్యారేజీ స్టోరీ, లిటిల్ ఉమెన్, పారాసైట్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, జోజో రాబిట్ వరుసగా ఉన్నాయి. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ మూవీ రెండు అవార్డులను దక్కించుకుంది. 

బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో … శామ్ మెండీస్ (1917), బాంగ్ జూన్-హో (ప్యారాసైట్), క్వింటన్ టరాంటినో (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్), టాడ్ ఫిలిఫ్స్ (జోకర్), మార్టిన్ స్కోర్సె (ది ఐరీష్ మ్యాన్) నామినేట్ అయ్యారు. 

బెస్ట్ యాక్టర్ అవార్డు జాబితాలో… జోక్విన్ ఫీనిక్స్ (జోకర్), ఆడమ్ డ్రైవర్ (మ్యారేజ్ స్టోరీ), ఆంటోనియో బాండెరాస్ (పెయిన్ అండ్ గ్లోరీ , లియోనార్డో డికాప్రియో (వన్స్ ఆపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్) జోనాథన్ ప్రైస్ (టూ పోప్స్) ఎంపికయ్యారు.  

బెస్ట్ యాక్టరస్ అవార్డుల జాబితాలో… స్కార్లెట్ జోహన్సన్ (మ్యారేజ్ స్టోరీ), సింథియా ఎరివో (హ్యారియెట్), సావోయిర్స్ రోనన్ (లిటిల్ ఉమెన్), చార్లీజ్ థెరాన్ (బాంబ్‌ షెల్), రెనీ జెల్వెగర్ (జూడీ) రేసులో ఉన్నారు. 

* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జాబితాలో బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) 
*  బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ – టాయ్ స్టోరీ -4 
* బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ హెయిర్ లవ్
*  బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జాబితాలో బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) 
* బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ – టాయ్ స్టోరీ -4
* బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ హెయిర్ లవ్
* బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే – బాంగ్ జాన్ హో (పారా సైట్)
* బెస్ట్ స్ర్కీన్ ప్లే- తైకా వెయిటిటి (జోజో రాబిట్)
* బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ద నైబర్స్ విండో
* బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
*  బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – జాక్వెలిన్ దుర్రాన్ (లిటిల్ ఉమెన్)