Oscars 2023: ఆస్కార్ వేదికపై ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం.. ‘నో’ చెప్పిన అకాడమీ!

గతేడాది జరిగిన కేన్స్, వేనిస్ ఫిలిం ఫెస్టివల్స్‭లో వర్చువల్ ద్వారా జెలెన్‭స్కీ ప్రసంగించారు. ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో కూడా ప్రసంగించారు. ఇటీవల ముగిసిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభోత్సవ వేడుకలో జెలెన్‭స్కీ కనిపించగానే అందరూ నిలబడి స్వాగతం పలికారు

Oscars 2023: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‭స్కీకి చుక్కెదురైంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్‭లోని డాల్బీ థియేటర్‭లో నిర్వహించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించేందుకు అకాడమీ నో చెప్పింది. కాగా, ఆయనకు అకాడమీ ఇలా నో చెప్పడం ఇది రెండవ సారి. కమెడియన్ నుంచి రాజకీయ నేతగా మారిన జెలెన్‭స్కీ, గతంలో పలు అవార్డుల కార్యక్రమాల్లో ప్రసంగించారు. అయితే గత ఏడాదిగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఈసారి ఆస్కార్ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా చేసే ప్రసంగం రద్దైంది.

Bihar: ఆవు మాంసం తరలిస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తిపై భీకర దాడి, వ్యక్తి మృతి

కాగా, గతేడాది జరిగిన కేన్స్, వేనిస్ ఫిలిం ఫెస్టివల్స్‭లో వర్చువల్ ద్వారా జెలెన్‭స్కీ ప్రసంగించారు. ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో కూడా ప్రసంగించారు. ఇటీవల ముగిసిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభోత్సవ వేడుకలో జెలెన్‭స్కీ కనిపించగానే అందరూ నిలబడి స్వాగతం పలికారు. కాగా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ “సినిమా వాస్తవమైనా, సైద్ధాంతికమైనా సరిహద్దులను గోడలను అధిగమించగలదు. కానీ నాగరికత, దౌర్జన్యం మధ్య ఈ రోజు రష్యా అదే గోడను నిర్మించాలనుకుంటోంది” అని అన్నారు.

Jharkhand : పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి డ్యాన్సులు.. ఐదుగురు పోలీసులు సస్పెండ్

వాస్తవానికి ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గోనే వారి జాబితాలో జెలెన్‭స్కీని చేర్చాలని డబ్ల్యూఎంఈ పవర్ ఏజెంట్ మైక్ సింప్సన్ అకాడమీని కోరారు. అయితే అందుకు అకాడమీ అంగీకరించలేదు. అలాగే ఇలాంటి ప్రతిపాదనలు తీసుకోమని కూడా అకాడమీ తేల్చి చెప్పింది. గతేడాది కూడా జెలెన్‭స్కీ ప్రసంగం గురించి ప్రతిపాదనను అకాడమీ తిరస్కరించింది. హాలీవుడ్ ఉక్రెయిన్ పట్ల మాత్రమే శ్రద్ధ చూపుతోందని ఆస్కార్ ప్రొడ్యూసర్ విల్ ప్యాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హాలీవుడ్ గతంలో అనేక యుద్ధాలను విస్మరించిందని ఆయన వాదించారు.

ట్రెండింగ్ వార్తలు