WHO: ఆఫ్రికాలో కొవిడ్ వేవ్.. కొద్దిపాటి ఉపశమనం

దక్షిణాఫ్రికాలో కొవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ కారణంగా ఆరు వారాలుగా నమోదవుతున్న కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేసుల తీవ్రతలో తగ్గుదల లేకపోగా ఎటువంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.

WHO: ఆఫ్రికాలో కొవిడ్ వేవ్.. కొద్దిపాటి ఉపశమనం

Covid Fourth Wave

WHO: దక్షిణాఫ్రికాలో కొవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ కారణంగా ఆరు వారాలుగా నమోదవుతున్న కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేసుల తీవ్రతలో తగ్గుదల లేకపోగా ఎటువంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం. కేసులు నమోదవుతున్న తీరుపై WHO గత వారం ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.

అందులో దక్షిణాఫ్రికాలో నమోదవుతున్న కేసుల్లో 14శాతం తగ్గుదల కనిపించాయి. ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో తొలిసారి ఆరు శాతం తగ్గినట్లుగా కనిపిస్తుందని చెప్పింది WHO. నార్త్, వెస్ట్ ఆఫ్రికాల్లో కేసుల నమోదు పెరుగుతూనే ఉంది. నార్త్ ఆఫ్రికాలో గత వారం 121 శాతం కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఖండాంతరంగా చూస్తే ఏడు రోజుల్లో మృతులు 64శాతం పెరిగాయి.

ఫోర్త్ వేవ్ లో అఫ్రికాలో నమోదవుతున్న మృతులు గత వేవ్ లతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకూ 30ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించగా.. డెల్టా వేరియంట్ 42దేశాల్లో కనిపించింది.

ఇది కూడా చదవండి : ఏపీలో కోవిడ్ పంజా..24 గంటల్లో 4,528 కేసులు

ముందుగా అందిన సూచనల ప్రకారం.. ఆఫ్రికాలో నాలుగో వేవ్ ఎప్పటికీ తగ్గడం ఉండదని తెలిపాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేసి నాలుగో వేవ్ నుంచి కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరో వేవ్ వస్తే మాత్రం ఏ రకంగానూ ఉపేక్షించేదిగా కనపడటం లేదని WHO ఆఫ్రికా రీజనల్ డైరక్టర్ అన్నారు.