COVID-19 Vaccine: రీసెంట్ వేరియంట్‌పై 80శాతం సమర్థవంతంగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్ కొవిడ్ వ్యాక్సిన్-19 రీసెంట్ వేరియంట్ B1.617.2పై 80శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ను రెండో డోసులుగా..

COVID-19 Vaccine: రీసెంట్ వేరియంట్‌పై 80శాతం సమర్థవంతంగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

Oxford Vaccine

COVID-19 Vaccine: ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్ కొవిడ్ వ్యాక్సిన్-19 రీసెంట్ వేరియంట్ B1.617.2పై 80శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ను రెండో డోసులుగా ఇవ్వడం వల్ల ప్రాణాంతక వైరస్ ను ఎదుర్కోగల్గుతున్నారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) డేటా ప్రకారం.. యూకే ఓ స్టడీ నిర్వహించింది.

వ్యాక్సిన్ రెండు డోసులుగా తీసుకోవడం ద్వారా B.117 వేరియంట్ పై 87శాతం ప్రొటెక్షన్ ఉంటుంది. దీనిని ఇంగ్లాండ్ లోని కెంట్ ప్రాంతంలో ముందుగా కనుగొన్నారు. ఈ విషయాన్ని ద టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ వెల్లడించింది.

గత వారంలో B1.617.2 వేరియంట్ కారణంగా పీక్స్ లో కేసులు పెరుగుతున్నాయి. ఇది పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. వారం వారం వస్తున్న రిపోర్టులను బట్టి ఈ విషయం స్పష్టమైందని కొవిడ్ జెనోమిక్స్ డైరక్టర్ డా. జెఫ్రె బారెట్ అంటున్నారు.

కెంట్ వేరియంట్ కంటే.. 20 లేదా 30 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చెప్పగలం. ఇండియాలో తొలిసారి గుర్తించినట్లుగా చెప్తున్న వేరియంట్ ఇంగ్లాండ్ ఎక్కువ మొత్తంలో వ్యాప్తి జరుగుతుందని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) వ్యాక్సిన్ ప్రోగ్రాంను ప్రకటించింది.

కమ్యూనిటీల మధ్య వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందనే వ్యాక్సినేషన్ త్వరగా చేపట్టాలని భావించారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సమర్థత కనబరచడంతో వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచనున్నట్లు తెలిపారు.