ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ 2020 చివరికే రావొచ్చంటోన్న ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు

ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ 2020 చివరికే రావొచ్చంటోన్న ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ COVID-19వ్యాక్సిన్ 2020 చివరికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యాక్సిన్ లీడ్ డెవలపర్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ ప్రయోగాత్మక వ్యాక్సిన్ కు అప్రూవల్ రావడానికి డిసెంబర్ వరకూ సమయం పట్టొచ్చు. లేదా అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు.

ప్రయోగాత్మక మెడిసిన్ కు ఆస్ట్రాజెనెకా (ఏజెడ్ఎన్.ఎల్) వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాకపోతే క్లినికల్ ట్రయల్స్ లో స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయని సోమవారం డేటా వెల్లడిస్తుంది. ‘వ్యాక్సిన్ విడుదల అవడానికి సంవత్సరాంతం వరకూ పట్టొచ్చు. కానీ అది కచ్చితం కాదు. మనం మూడు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని సారా గిల్బెర్ట్ ఇంగ్లీష్ మీడియా బీబీసీతో మాట్లాడుతూ అన్నారు.

ఈ ట్రయల్స్ చివరి దశకు చేరుకుని లైసెన్స్ పొందిన తర్వాత ఎమర్జెన్సీగా యూజ్ చేయాలన్నా సమయం పడుతుంది. చాలా పెద్ద మొత్తంలో మ్యాన్యుఫ్యాక్చర్ అయితేనే ప్రతి ప్రాంతానికి మందులు పంపించి అవసరమైన వారికి ఇప్పించగలం.

క్రిస్టమస్ కంటే ముందే వ్యాక్సిన్ రావడానికి ప్రయత్నించినా.. చాలా తక్కువ మందికి మాత్రమే అందుతుంది. ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు సెప్టెంబర్ నెలాఖరుకు మిలియన్ డోస్ ల పొటెన్షియల్ వ్యాక్సిన్ రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.