బ్రిటన్ లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ‌ట్రయల్స్ మళ్ళీ షురూ

  • Published By: venkaiahnaidu ,Published On : September 12, 2020 / 09:07 PM IST
బ్రిటన్ లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ‌ట్రయల్స్ మళ్ళీ షురూ

ప్రపంచ దేశాలన్ని ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ మీదనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో..బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ని తాత్కలింగా నిలిపివేస్తున్నట్లు బుధవారం ఆస్ట్రాజెనెకా అధికారికంగా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. 3వ దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్ర‌యోగ ప్రామాణిక ప్ర‌క్రియ‌, వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌పై పూర్తిస్థాయి స‌మీక్ష కోసం ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆస్ట్రాజెనెకా తెలిపింది.


అయితే, మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ(MHRA) అన్ని అనుమతులు రావడంతో బ్రిటన్ లో తిరిగి వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి . వ్యాక్సిన్ భద్రతపై సమీక్షించేందుకు ఏర్పాటైన స్వతంత్ర కమిటీ… వ్యాక్సిన్ భద్రమేనని, ప్రయోగాలు ప్రారంభించవచ్చునని MHRAకి సిఫార్సు చేసిందని,దీంతో MHRA నుంచి అనుమతులు రావడంతో తిరిగి ప్రయోగాలను ప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది.

మరోవైపు, భారత్ లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చేపడుతున్న పూణే లోని ప్రముఖ వ్యాక్సిన్ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా సూచనల ప్రకారం వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసింది