క్రిస్మస్ కంటే ముందే…ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది

  • Published By: venkaiahnaidu ,Published On : December 14, 2020 / 08:00 PM IST
క్రిస్మస్ కంటే ముందే…ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది

Oxford’s Covid vaccine ‘pretty likely’ to be rolled out BEFORE Christmas క్రిస్మస్ కంటే ముందే 40లక్షల డోసులతో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కంటే ముందే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించే అవకాశముందని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న సైంటిస్ట్ బృందంలో ఒకరైన ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ తెలిపారు.

వ్యాక్సిన్ భద్రత,ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తు జరిగిన క్లినికల్ ట్రయిల్స్ డేటాని ప్రస్తుతం మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెడ్యులేటరీ ఏజెన్సీ(MHRA)పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభిస్తుందన్నారు.

ఔషద దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనికా ఇప్పటికే 40లక్షల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసి,వాటిని వియోగించేందుకు సిద్ధం చేసిందని సమాచారం. మొత్తం 10 కోట్ల డోసుల కోసం బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 5కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇవి సరిపోతాయి.

వచ్చే ఏడాది మార్చి చివరినాటికి 7కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనావేసినట్లు ఆస్ట్రాజెనికా తెలిపింది. 3.5కోట్ల మంది బ్రిటన్ వాసులకు వ్యాక్సినేషన్ కోసం ఇవి సరిపోతాయి. కాగా,ఇప్పటికే ఫైజర్/ఎన్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దేశంలో అనుమతిచ్చిన నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ బ్రిటన్ లో అనుమతి పొందనున్న రెండవ కోవిడ్ వ్యాక్సిన్ గా నిలువనుంది.

కాగా, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందకు అన్ని దేశాలకు వివిధ టెక్నాలజీలతో తయారుచేసిన పలు కరోనా వ్యాక్సిన్లు అవసరమని సారా గిల్బర్ట్ నొక్కి చెప్పారు. అయితే, క్రిస్మస్ సమయంలో ప్రజల ప్రవర్తన వ్యాకినేషన్ కార్యక్రమంపై ప్రభావం చూపుతుందని, ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి జరిగితే నర్సులు,డాక్టర్లు కూడా అనారోగ్యానికి గురవ్వచ్చునని ఆమె తెలిపారు.

మరోవైపు, అత్యవసర వినియోగం కోసం డిసెంబర్-2 బ్రిటన్ రెగ్యులేటర్స్ ఆమోదం పొందిన ఫైజర్/ఎన్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే వేలమంది బ్రిటన్ వాసులకు ఇచ్చారు.