Viral Video: ‘‘నీ పని నువ్వు చూసుకో..’’ అంటూ మత పెద్దలకు బుద్ధి చెబుతున్న ఇరాన్ అమ్మాయిలు

ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం వచ్చింది. హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమ్మాయిలు ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. తమను అణచివేయాలని భద్రతా బలగాలు ఎన్ని చర్యలకు పాల్పడుతున్నప్పటికీ అమ్మాయిలు ఏ మాత్రం భయపడడం లేదు. అంతేగాక, హిజాబ్ ధరించాలని చెబుతున్న మత పెద్దలపై అమ్మాయిలు తిరగబడుతున్నారు. ‘‘సరైన దస్తులు ధరించు’’ అంటూ ఆ యువతితో మతపెద్ద అన్నాడు. దీంతో ఆ యువతి వెంటనే ‘‘నీ పని నువ్వు చూసుకో’’ అని తిట్టి అతడికి బుద్ధి చెప్పింది.

Viral Video: ‘‘నీ పని నువ్వు చూసుకో..’’ అంటూ మత పెద్దలకు బుద్ధి చెబుతున్న ఇరాన్ అమ్మాయిలు

Viral Video: ఇరాన్ అమ్మాయిల్లో చైతన్యం వచ్చింది. హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమ్మాయిలు ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. తమను అణచివేయాలని భద్రతా బలగాలు ఎన్ని చర్యలకు పాల్పడుతున్నప్పటికీ అమ్మాయిలు ఏ మాత్రం భయపడడం లేదు. అంతేగాక, హిజాబ్ ధరించాలని చెబుతున్న మత పెద్దలపై అమ్మాయిలు తిరగబడుతున్నారు. ‘‘సరైన దస్తులు ధరించు’’ అంటూ ఆ యువతితో మతపెద్ద అన్నాడు. దీంతో ఆ యువతి వెంటనే ‘‘నీ పని నువ్వు చూసుకో’’ అని తిట్టి అతడికి బుద్ధి చెప్పింది.

మరో ప్రాంతంలో ‘‘హిజాబ్ ధరించు’’ అంటూ ఓ మహిళను మత పెద్ద బెదిరించాడు. దీంతో ఆ మహిళ వెంటనే ‘‘నేను ధరించను.. తెలివి తక్కువోడా’’ అంటూ తిట్టింది. మరో చోట మత పెద్దతో ఓ అమ్మాయి వాదిస్తూ.. ‘‘ఇది నా దేశం.. నేను ఎక్కడ హిజాబ్ ధరించాలి.. ఎక్కడ ధరించవద్దు అన్న విషయాన్ని నువ్వు నాకు చెప్పడం ఏంటీ?’’ అని కసురుకుంది.

‘‘నా దేశంలో నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా’’ అని మరో అమ్మాయి చెప్పింది. ‘‘బట్టలు సర్దుకుని వెళ్లిపో’’ అంటూ మరో యువతి తిట్టింది. ఇన్నాళ్లు మత పెద్దలు చెప్పినట్లు చుట్టూ గీత గీసుకుని, తమ హక్కులను వినియోగించుకోకుండా ఉన్న అమ్మాయిలు, మహిళలు ఇప్పుడు స్వేచ్ఛా జీవితం కోసం పోరాడుతున్నారు. కఠిన చట్టాలు, హిజాబ్ నిబంధనలు వద్దంటూ నినాదాలు చేస్తున్నారు.

మతపెద్దలకు అమ్మాయిలు ఎదురు చెబుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇరాన్ యువతులు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కొన్ని వారాల క్రితం ఇరాన్ లో హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్ లో పోరాటం ప్రారంభమైంది. తమకు విధించిన సంకెళ్లను తెంచుకున్నామని అమ్మాయిలు, మహిళలు నినదిస్తున్నారు. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎలా నడుచుకోవాలో ఇంకొకరు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..