ఆవుల వెనుక కూడా కళ్లు.. దడుసుకుంటున్న సింహాలు, హైనాలు

ఆవుల వెనుక కూడా కళ్లు.. దడుసుకుంటున్న సింహాలు, హైనాలు

రీసెర్చర్లు పశువులను కాపాడుకోవడానికి కొత్త తరహాలో ఆలోచించారు. పశువుల వెనుక భాగంపై కళ్ల గుర్తులను పెయింటింగ్‌గా వేస్తున్నారు. ఆవులపై సింహాలు, హైనాలు జరిగే దాడుల నుంచి అడ్డుకోవడానికి పెయింటింగులు వేస్తున్నారట. పశువులను కాపాడుకోవడానికి రైతుల జీవనాధారాలను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సింహాలు, పెద్ద పిల్లులు వాటిని చంపేయకుండా కాపాడుకునే ప్రక్రియలో భాగమే ఇది.



ఒకవాంగో డెల్టా ప్రాంతంలోనే ఆఫ్రికాలో ఫ్యామస్ అయిన జంతువులు ఎక్కువగా తిరుగుతుంటాయి. అక్కడే సింహాలు, హైనాలు, చిరుత పులులు, ఛీతాలు, అడవి కుక్కలు కనిపించాయి. ఇంకొక కీలక విషయమేమిటంటే సదరన్ ఆఫ్రికా ప్రాంతంలో 80శాతం మందికి ఆధాయ వనరు కూడా వ్యవసాయమే. ఆ క్రూర జంతువులను మళ్లించడమే మనం చేయగల పని. ఒకవేళ అది కుదరక దాడి జరిగిపోతే నష్టాన్ని వెనక్కి తీసుకోలేనంతగా ఉంటుంది.



జంతువుల నుంచే కాకుండా.. వేటగాళ్ల నుంచి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇలా పెయింటింగ్స్ వేసిన తర్వాత 50శాతం వచ్చే చిరుతపులుల్లో 38శాతం మాత్రమే వస్తున్నాయి. సింహాలు 25శాతం మాత్రమే తగ్గాయి. ‘సింహాల నుంచే పెద్ద ప్రమాదం. ఇలా చేయడం వల్ల మరేదో జంతువు అనుకుని అవి తప్ప దారిపడుతున్నాయి’ అని యూఎన్ఎస్‌డబ్ల్యూ సైన్స్ అండ్ తరోంగా వెస్టరన్ ప్లైయిన్స్ జూ రీసెర్చర్ డా.నీల్ జోర్డాన్ ఓ స్టేట్ మెంట్లో తెలిపారు.



మిగిలిన జంతువుల కంటే కంటి గుర్తు పెయింటింగ్ వేసిన జంతువుల గ్రూప్ ఎక్కువ సేఫ్ గా ఉంది. ఈ కళ్లు కొత్తగా ఉండేవి కావు. సీతాకోక చిలుకల మీదా.. ఉంటాయి. వేటాడటానికి వచ్చిన జంతువుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి. ఈ రీసెర్చ్ సక్సెస్ అయినట్లుగానే అనిపిస్తుంది.