బ్రష్,కలర్స్, ఏమీ అక్కర్లా : ఎండతోనే పెయింటింగ్

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 11:21 AM IST
బ్రష్,కలర్స్, ఏమీ అక్కర్లా  : ఎండతోనే పెయింటింగ్

ఆర్టిస్టులు పెయింటింగ్ ఎలా వేస్తారు. సిల్లీ క్వశ్చన్. బ్రష్ తో వేస్తారు కదూ. లేదా కలర్స్ కలిపి పెయిటింగ్స్ వేస్తారు. అదీకాకుంటే శాండ్ ఆర్ట్..నెయిల్ ఆర్ట్ ఇవన్నీ పెయింటింగ్స్ వేస్తుంటారు. వారి వారి అభిరుచుల మేరకు వారు పెయింటింగ్స్ వేస్తుంటారు. కానీ మనం ఇప్పుడు మనం .సమ్ థింగ్ స్పెషల్ ఆర్ట్ గురించి ఆర్టిస్ట్ గురించి చెప్పుకుందాం. ఏమా ఆర్ట్..ఎవరా ఆర్టిస్ట్ అనుకుంటున్నారా? ఆ ఆర్టిస్ట్ పేరు మైకెల్ పపడాకిస్వేసే. ఆ ఆర్ట్ పేరు ‘హెలియోగ్రఫీ’. ఈ ఆర్ట్ 1822 లో జోసెఫ్ నైస్ పోరే నియప్సీ  అనే ఆర్టిస్ట్ కనిపెట్టాడట. (1765 మార్చ్ 7 వ తేదీన పుట్టిన ఈయన 1833 జులై 5న మరణించారు).
 

సూర్యుడి నుంచి వచ్చే ఎండతో పెయింటింగ్‌లు వేసి అదరగొట్టేస్తున్నాడు. దానికి కావాల్సిందల్లా సూర్య కిరణాలు..ఒక భూత అద్దం. ఏంటీ చిన్నప్పుడు ఎండలో నడుస్తు..ఏంటీ మీ బాల్యం గుర్తొస్తోందా? కచ్చితంగా..
 

చిన్నప్పుడు ఎర్రటి ఎండలో ఓ పేపర్ పెట్టి దాని మీద అగ్గిపుల్లను ఉంచి..ఎండను భూతద్దం మీద పడేలా చేసి.. భూతద్దం నుంచి ప్రతిబింబించే సూర్యుడి కిరణాలను ఆ అగ్గి పుల్ల మీద పడేలా చేస్తే..కొంచెం సేపటి భూతద్దాన్ని అగ్గిపుల్ల మీద పెట్టి ఉంచితే ఆ అగ్గిపుల్ల మండిపోయేది కదూ..
 

అదే కాన్సెప్ట్‌ తో మంచి పేరు తెచ్చుకున్నాడు మైకెల్ పపడాకిస్వేసే.సన్నగా Swear Angle (చతురస్రాకారం)లో ఉండే ఓ చెక్క ముక్కా..మరో Rectangular (దీర్ఘచతురస్రాకారం)లో  ఉండే చెక్క.. ఇలా రెండు చెక్కలను తీసుకున్నాక..సేమ్ టు సేమ్ భూతద్దంతో సూర్యకిరణాలను ఆ చెక్క మీద పడేలా చేసి చెక్కను కాల్చి అద్భుతమైన పెయింటిగ్స్ వేస్తాడు. కలర్స్ కానీ.. ఇతరత్రా బ్రష్‌లు కానీ ఏవీ వాడకుండా.. కేవలం ఒక భూతద్దం, సూర్యకిరణాలు, చెక్క.. ఈ మూడింటితో బ్రహ్మాండమైన పెయింటింగ్‌లు వేయడంలో దిట్ట ఆ ఆర్టిస్ట్.
 

ఇలా పెయింటింగ్ వేయడాన్ని హెలియోగ్రఫీ అని అంటారు. అతడు ఈ పెయింటింగ్స్‌ను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తుండటంతో అవి వైరల్‌గా మారడం.. నెటిజన్లు మైకెల్ పపడాకిస్వేసే వినూత్న టాలెంట్‌ను గుర్తించడంతో ఆ ఆర్టిస్ట్ గురించి అందరికి తెలిసిపోయింది. యూఎస్‌కు చెందిన  మైకెల్ పపడాకిస్వేసే. 2012లో ఎండతో పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. 2016లో తన సొంత కంపెనీ సన్‌స్ర్కైబ్స్‌ను స్థాపించాడు. తన కంపెనీ పేరుతో తన పెయింటింగ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు డిఫరెంట్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ పెయింటర్.