Pak Army: కేంద్రం కనుసైగ చేస్తేచాలు పీవోకేను స్వాధీనం చేసుకుంటామని భారత ఆర్మీ చేసిన ప్రకటనపై పాక్ ఆర్మీ స్పందన

‘మా భూభాగంపై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టగల సామర్థ్యం మాకు ఉంది. అందుకు సన్నద్ధంగా ఉన్నాం’’ అని పాక్ ఆర్మీ చెప్పింది. ‘‘ఉపేంద్ర ద్వివేదీ చేసింది అనవసర ప్రకటన’’ అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి భారత ఆర్మీ ధోరణి ఏంటో స్పష్టమవుతోందని పాక్ ఆర్మీ పేర్కొంది. భారత ఆర్మీ తీరు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. దృష్టిని మళ్లించడానికే ల్యాంచ్ పాడ్లు, ఉగ్రవాదులు అంటూ భారత ఆర్మీ ఆరోపణలు చేసిందని చెప్పింది.

Pak Army: కేంద్రం కనుసైగ చేస్తేచాలు పీవోకేను స్వాధీనం చేసుకుంటామని భారత ఆర్మీ చేసిన ప్రకటనపై పాక్ ఆర్మీ స్పందన

Pak Army

Pak Army: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే చాలని, వెంటనే అమలు చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని భారత ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర త్రివేదీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. అలాగే, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో లాంచింగ్ ప్యాడ్‌లు, ఉగ్రవాదులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్ ఆర్మీ ఓ ప్రకటన చేసింది.

‘‘మా భూభాగంపై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టగల సామర్థ్యం మాకు ఉంది. అందుకు సన్నద్ధంగా ఉన్నాం’’ అని పాక్ ఆర్మీ చెప్పింది. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, ఉగ్రవాదుల వల్ల భారత్ కు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని తాజాగా ఉపేంద్ర త్రివేదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

దాదాపు 160 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడడానికి పీవోకేలోని లాంచింగ్ ప్యాడ్‌ల వద్ద వేచి ఉన్నారని మొన్న చెప్పారు. దీనిపై పాకిస్థాన్ ఆర్మీ స్పందిస్తూ… ‘‘ఉపేంద్ర ద్వివేదీ చేసింది అనవసర ప్రకటన’’ అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి భారత ఆర్మీ ధోరణి ఏంటో స్పష్టమవుతోందని పాక్ ఆర్మీ పేర్కొంది. ఆర్మీ తీరు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. దృష్టిని మళ్లించడానికే ల్యాంచ్ పాడ్లు, ఉగ్రవాదులు అంటూ భారత ఆర్మీ ఆరోపణలు చేసిందని చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..