దిలీప్ కుమార్ పాతింటిని దక్కించుకొనేందుకు పాక్ ప్లాన్!

దిలీప్ కుమార్ పాతింటిని దక్కించుకొనేందుకు పాక్ ప్లాన్!

dilip-kumar:బాలీవుడ్‌ దివంగత నటుడు దిలీప్‌ కుమార్‌ పాత ఇంటిని తక్కువ ధరకు కొట్టేదామని పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పక్తున్‌క్వా ప్రాంతంలో దాదాపు 25 కోట్లు పలికే ఆయనకు ఓ సొంతిల్లు ఉంది. ఆ ఇంటిని 80 లక్షల 56వేలు చెల్లించి స్వాదీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై దిలీప్‌కుమార్‌ భవనాన్ని గతంలో కొనుగోలు చేసిన యజమాని హజీలాల్‌ మహ్మద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 15 ఏళ్ల కిందటే 51 లక్షలకు కొనుగోలు చేస్తే… ఇంత దారుణంగా తక్కువ ధరకు ఎలా కోట్‌ చేస్తారని ప్రశ్నించారు.

పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇస్తానన్న ధర అన్యాయమని ఆయన తెలిపారు. ప్రభుత్వం చెప్తున్న మొత్తానికి భవనాన్ని అమ్మే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన భవనాన్ని హెరిటేజ్‌ కట్టడంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక చర్చల దశలో ఉన్న ఈ భవనం అమ్మకంపై తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు. 2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది. రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్‌ ప్లాజాలను నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని సంరక్షించాలని పురావస్తు శాఖ భావించింది.

2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది. రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్‌ ప్లాజాలను నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని సంరక్షించాలని పురావస్తు శాఖ భావించింది.