Pak Media: మోదీపై పాక్ మీడియా ప్రశంసలు.. కారణం ఏంటంటే..?

పాక్‌లో నెలకొన్ని పరిస్థితులను ఉద్దేశిస్తూ.. ఆ దేశం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతిపై విరుచుకుపడింది. ఇక భారత్ అనుసరిస్తున్న ర్ధిక విధానాలను, విదేశాంగ నీతిని ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని పాకిస్థాన్ దిన పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తాజాగా కీర్తించింది. భారత ప్రతిష్టను మోదీ పెంచుకుంటూ పోతున్నారంటూ షహజాద్ చౌధరి అనే రాజకీయ, భద్రత, రక్షణ విశ్లేషకుడు ఈ కథనాన్ని రాశారు.

Pak Media: మోదీపై పాక్ మీడియా ప్రశంసలు.. కారణం ఏంటంటే..?

Pak media prises pm modi amid pak economic crisis

Pak Media: భారత్ అంటేనే తప్పుడుగా చూపించే, తప్పుడుగా ప్రచారం చేసే పాక్, ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, కొంత కాలంగా భారత ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలతోనే భారతీయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, తాజాగా ఆ దేశ మీడియా సైతం మన దేశ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. అయితే ప్రశంసలు ఆర్థిక వ్యవస్థపై భారత్ పటిష్టతపై చేస్తున్నవి. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్థికంగా కూరుకుపోతుండడంతో అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇలా భారత్ మీద లేని ప్రేమను ఒలకబోస్తున్నాయి.

Supriya Sule: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. తప్పిన ప్రమాదం

పాకిస్థాన్‌లో విదేశీ మారక నిల్వలు ఆవిరైపోతూ ధరలు ఆకాశానికి అంటుతూ, ప్రజలు నానా యాతనలు పడుతున్న విషయం తెలిసిందే. గోధుమ పిండికి కూడా గ్రూపు కుమ్ములాటలు జరుగుతున్నాయి. మరొకపక్క సరిహద్దు దేశమైన మన దేశంలో అలాంటి ఘటనలేవీ కనిపించడం లేదు. ఆ దేశంతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు ఎక్కువ జనాభా ఉన్న భారత్ ఈ విషయంతో కాస్త మెరుగ్గానే ఉండడంతో, పాక్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే భారత ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Nirmala Sitharaman: నేను మధ్యతరగతే, వారి కష్టాలు తెలుసు.. బడ్జెట్‭పై ఆర్థిక మంత్రి నిర్మలా