అయోధ్య తీర్పుపై పాక్ మంత్రుల ఆగ్రహం 

  • Published By: chvmurthy ,Published On : November 10, 2019 / 06:36 AM IST
అయోధ్య తీర్పుపై పాక్ మంత్రుల ఆగ్రహం 

అయోధ్యలోని వివాదాస్పద  రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు.  ఓ వైపు కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని  పాకిస్తాన్ విదేశాంగమంత్రి  షా మహ్మద్‌ ఖురేషీ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ చర్యతో తాను బాధకు గురయ్యాన్నారు.

సంతోషకరమైన సమయంలో ఇలాంటి సున్నిత అంశంపై తీర్పు చెప్పటం సరి కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. సిక్కుల మత గురువైన గురునానక్‌ జయంతి ఉత్సవాలు జరుగుతున్నందున, ఇప్పుడే ఇవ్వటం కంటే,  మరికొంత కాలం ఆగి తీర్పు ఇచ్చి ఉండాల్సింది అన్నారు.భారతీయ ముస్లింలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారని, తాజా తీర్పుతో వారు మరింత ఒత్తిడికి లోనవుతారని ఖురేషీ అన్నారు.

పాక్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌  ఈ తీర్పును అన్యాయపు తీర్పుగా అభివర్ణించారు. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖలో ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ అసిస్టెంట్‌ ఫిర్‌దౌస్‌ ఆషిఖ్‌ అవాన్‌ సుప్రీంకోర్టును కేంద్రం నడుపుతోందంటూ వ్యాఖ్యానిం చారు. ఓ వైపు పాక్‌ కర్తార్‌పూర్‌తో మైనారిటీల హక్కులకు రక్షణ కల్పిస్తుంటే, భారత్‌ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని అన్నారు