భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ కాల్పులు

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 04:32 AM IST
భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ కాల్పులు

శ్రీనగర్‌ : పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి  ఉల్లంఘించింది. మార్చి 4 సోమవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో అక్నూర్‌ సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఆర్మీ కాల్పులు జరిపింది. మోర్టార్‌ షెల్స్‌తో దాడులకు పాల్పడింది. పాక్‌ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. తెల్లవారుజామున 3 గంటలకు కాల్పులు ప్రారంభించిన పాక్‌.. ఉదయం 6.30 గంటల వరకు కొనసాగించింది. 
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

మార్చి 2 శనివారం పాకిస్తాన్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందిన సంగతి విధితమే. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని బంక్‌లు ఏర్పాటు చేయాలని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో అదనంగా 400 బంక్‌లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ బంక్‌లను నెల లోపే నిర్మించాలని ఆదేశించింది.
Also Read : ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఆహారం ఇచ్చిన పంజాబ్ పోలీసులు