థియేటర్లు బంద్ : పాక్ లో భారత సినిమాలు నిషేధం

  • Published By: chvmurthy ,Published On : February 27, 2019 / 07:55 AM IST
థియేటర్లు బంద్ : పాక్ లో భారత సినిమాలు నిషేధం

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత్ చేసిన  వైమానిక దాడులతో ఖంగుతిన్నపాకిస్తాన్  కోపంతో రగిలిపోతోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ సైన్యాన్ని రెచ్చగొడుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా భారత సినిమాల పై నిషేధం విధించింది. పాకిస్తాన్లో ఇక నుంచి భారత సినిమాలు ఆడనివ్వబోమని పాకిస్తాన్ సమాచార ప్రసార శాఖా మంత్రి ఫవాద్ హుస్సేన్ తెలిపారు.  
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు

ఈ మేరకు ……” సినిమా ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ ఇండియన్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేసింది. ఇకపై పాకిస్తాన్‌లో ఒక్క భారతీయ సినిమా కూడా విడుదల కాదు. అదేవిధంగా భారత్‌లో నిర్మించిన ప్రకటనల ప్రదర్శన వ్యతిరేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు” అని ట్వీట్‌ చేశారు.

కాగా… మరో వైపు భారత్ లో  పాక్ నటులపై బాలివుడ్ నిషేధం విధించింది.  పుల్వామా దాడి,  పాక్ లోని ఉగ్రవాద శిబిరాల పై భారత్ మెరుపు దాడులు తర్వాత పాక్ నటుల వీసాలను నిరాకరించాలని సినీ వర్కర్ల సంఘం  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది.
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్

కొందరు బాలీవుడ్ నటులైతే తమ సినిమాలు పాకిస్తాన్ లో విడుదల చేయమని స్వచ్చందంగా ప్రకటించారు.  ఈ పరిస్ధితుల్లో  పాక్  నిర్ణయం  భారతీయ సినిమాలపై  పెద్దగా ఎఫెక్టు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. 
Pakistan banned indian cinema
Also Read: మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్