దేశవ్యాప్త లాక్ డౌన్ కు పాక్ రెడీ

దేశవ్యాప్త లాక్ డౌన్ కు పాక్ రెడీ

Pakistan Considering Complete Lockdown

Pakistan పాకిస్తాన్ లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత కోవిడ్-19 కేసుల పాజిటివిటీ రేటు వచ్చే వారం కూడా కొనసాగితే లాక్ డౌన్ విధించక తప్పదని ఇమ్రాన్ ప్రభుత్వం తెలిపింది.

పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రి మంత్రి ఫవాద్ చౌదరి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…ప్రస్తుత కేసులు నిష్పత్తి 11శాతం ఇంకో ఒక వారం కొనసాగితే దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని అన్నారు. దేశంలో పూర్తి లాక్ డౌన్ పరిస్థితిని నివారించడానికి గత ఏడాది నుండి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, లాక్ డౌన్ నిర్ణయం రోజువారీ వేతన కూలీలు మరియు వ్యాపారులకు తీవ్రమైన పరిణామాలను సృష్టిస్తుందని తెలిపారు. అయితే,కేసులు సంఖ్య పెరిగితే లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం ఏర్పడతదని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లోకి వెళ్తుందన్న కారణంతో పూర్తిస్థాయి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రతిపాదనను ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇప్పటివరకు ప్రతిఘటించారు, అయితే ఒక వారంలో పరిస్థితి అదుపులోకి రాకపోతే పూర్తి లాక్డౌన్ గురించి ఆలోచించవలసి వస్తుందని ఫవాద్ చౌదరి చెప్పారు. ఇక, వైరస్ వ్యాప్తికి కట్టడి కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్ఓపి) అనుసరించాలని చౌదరి దేశంలోని వ్యాపారులను అభ్యర్థించారు.