Pakistan Crisis : ఇమ్రాన్ ఇష్యూపై సుప్రీం విచారణ.. అందరిలో ఉత్కంఠ

అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. పాక్‌ అటార్నీ జనరల్‌, డిప్యూటీ అటార్నీ జనరల్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక.. దేశ ప్రజలను...

Pakistan Crisis : ఇమ్రాన్ ఇష్యూపై సుప్రీం విచారణ.. అందరిలో ఉత్కంఠ

Pak

Pakistan Supreme Court : పాకిస్తాన్‌ రాజకీయ సంక్షోభంలో.. ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అసెంబ్లీ రద్దు, అవిశ్వాస తీర్మానం తిరస్కరణ వ్యవహారాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. అసెంబ్లీ రద్దు తర్వాత.. ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వంపై నిషేధం విధించింది ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. అసెంబ్లీ రద్దు, ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మాణం అంశాలపై.. 2022, ఏప్రిల్ 04వ తేదీ సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించింది సుప్రీంకోర్టు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంతో ఇమ్రాన్ పదవి ఊడిపోయింది.

Read More : Pakistan: ఓటింగ్ కు ముందే మైనార్టీలో ఇమ్రాన్ ప్రభుత్వం..!

ప్రస్తుత పరిస్థితిలో ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగరంటూ కేబినెట్ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతకు ముందు.. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారు. ఈ అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందని అభిప్రాయపడ్డారు. సభను ఈ నెల 25 వరకు వాయిదా వేశారు. అయితే.. డిప్యూటీ స్పీకర్‌ తీరుపై విపక్ష పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.

Read More : Pakistan: 75ఏళ్లలో 21మంది ప్రధానులు.. పూర్తికాలం ఒక్కరు కూడా

అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. పాక్‌ అటార్నీ జనరల్‌, డిప్యూటీ అటార్నీ జనరల్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. పాకిస్తాన్ భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయిస్తారన్నారు ఇమ్రాన్‌. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని కోరారు. అటు.. జాతీయ అసెంబ్లీ రద్దవడంతో.. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.