జైషే చీఫ్ మసూద్ సోదరుడు అరెస్ట్

జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అష్గర్ ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 44 మంది ఉగ్రవాదులను పాక్ అదుపులోకి తీసుకుంది.

  • Published By: sreehari ,Published On : March 5, 2019 / 12:37 PM IST
జైషే చీఫ్ మసూద్ సోదరుడు  అరెస్ట్

జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అష్గర్ ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 44 మంది ఉగ్రవాదులను పాక్ అదుపులోకి తీసుకుంది.

జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అష్గర్ ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 44 మంది ఉగ్రవాదులను పాక్ అదుపులోకి తీసుకుంది. వీరిలో జైషే చీఫ్ మసూద్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అష్గర్ కూడా ఉన్నట్టు తెలిపింది.

అష్గర్ ను ప్రొటక్టివ్ కస్టడీలో ఉంచినట్టు పాక్ అధికారులు తెలిపారు. ఈ మేరకు పాకిస్థాన్ ఇంటిరీయర్ మినిస్టర్ షహర్యాయర్ అఫ్రిదీ మీడియా సమావేశంలో వెల్లడించారు.  
Also Read : అప్పుల తిప్పలు : యూట్యూబ్‌లో చూసి దొంగనోట్ల తయారీ

ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటూ అంతర్జాతీయ ఒత్తిడి నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలపై కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్ అరెస్ట్ చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుంటే వారిని వెంటనే రిలీజ్ చేస్తామని మంత్రి అఫ్రిది తెలిపారు.

ఉగ్రవాదంపై భారత్ ఒత్తిడితో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకోలేదని, నేషనల్ యాక్షన్ ప్లాన్ కమిటీ నిర్ణయం ఆధారంగా పాకిస్థాన్ చర్యలు చేపట్టినట్టు పాక్ అధికారులు తెలిపారు. 
Also Read : విమానంలో జైహింద్ అనాల్సిందే