Pakistan Imran Khan: అద్దెకు పీఎం ఇమ్రాన్ ఖాన్ నివాసం.. నిధుల కోసమే తంటాలు

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారిక నివాసమైన ఇస్లామాబాద్ రెడ్ జోన్ అద్దెకు ఇచ్చేందుకు రెడీ అయింది ప్రభుత్వం. పాకిస్తాన్ ఫెడరల్ క్యాబినెట్ ఈ మేర మంగళవారం తుది నిర్ణయం తీసుకున్నారు. దేశానికి నిధులు సమకూర్చే పనిలో భాగంగా.. కల్చరల్, ఫ్యాషన్, ఎడ్యుకేషన్ లేదా ఇతర ఈవెంట్లకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు.

Pakistan Imran Khan: అద్దెకు పీఎం ఇమ్రాన్ ఖాన్ నివాసం.. నిధుల కోసమే తంటాలు

Pak Imran Khan

Pakistan Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారిక నివాసమైన ఇస్లామాబాద్ రెడ్ జోన్ అద్దెకు ఇచ్చేందుకు రెడీ అయింది ప్రభుత్వం. పాకిస్తాన్ ఫెడరల్ క్యాబినెట్ ఈ మేర మంగళవారం తుది నిర్ణయం తీసుకున్నారు. దేశానికి నిధులు సమకూర్చే పనిలో భాగంగా.. కల్చరల్, ఫ్యాషన్, ఎడ్యుకేషన్ లేదా ఇతర ఈవెంట్లకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు.

క్రమశిక్షణ, చక్కని ప్రవర్తనతోనే ఉండేవారికి మాత్రమే కేటాయించనున్నారు. ఈ నిర్వహణ బాధ్యతలు చూసుకోవడానికి రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.

2019 ఆగష్టులోనే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రధాని అధికారిక నివాసాన్ని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెడరల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ గా మార్చనున్నట్లు ప్రకటించారు. పాలిత ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గవర్నర్లు ఇకపై పాత సంప్రదాయం పాటిస్తూ.. గవర్నర్ హౌజ్ లలో ఉండాల్సిన అవసర్లేదని అన్నారు. దాని కోసం అయ్యే భారీ ఖర్చును తగ్గించి వెల్ఫేర్ స్కీంల కోసం ఖర్చు పెట్టాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.

అదే సమయంలో ప్రధాని ఇస్లామాబాద్ లోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి బనీ గలాలోని తన ఇంటికి షిఫ్ట్ అయ్యారు. బ్రిగేడియర్ వసీమ్ ఇఫ్తిఖర్ చీమా కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే పెళ్లి వేడుకకు కూడా అటెండ్ అయ్యారు పీఎం.

ఇస్లామాబాద్ లోని అధికారిక నివాసాన్ని మెయింటైన్ చేయడానికి దాదాపు రూ.470 మిలియన్ (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.21 కోట్లు) వరకూ ఖర్చు అవుతు్నట్లు తెలిపారు. అందుకే ప్రధాని ఖాళీ చేశారని అన్నారు. పాక్ ప్రభుత్వానికి సంబంధించిన 61లగ్జరీ కార్లను కూడా వేలానికి పెట్టి నగదు సమీకరించారు.