Croaker Fish : మత్స్యకారుడి వలలో చిక్కిన లక్షలు ఖరీదు చేసే భారీ చేప

సముద్రంలో చేపలు పట్టే మత్స్య కారులకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అలా వారికి చిక్కిన చేపలు భారీ విలువ చేసేవైతే ఆ పల్లెవాడి పంట పండినట్లే. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవచ్చు. ఓ పల్లెకారుడి పంట పండి ఓ అరుదైన భారీ చేప వలలో పండింది. పాకిస్థాన్ లోని గ్వాదర్ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడికి లక్షలు విలువ చేసే అత్యంత అరుదైన చేప దక్కింది.

Croaker Fish : మత్స్యకారుడి వలలో చిక్కిన లక్షలు ఖరీదు చేసే భారీ చేప

Croaker Fish

Croaker Fish : సముద్రంలో చేపలు పట్టే మత్స్య కారులకు అరుదైన చేపలు చిక్కతుంటాయి. అలా వారికి చిక్కిన చేపలు భారీ విలువ చేసేవైతే ఆ పల్లెవాడి పంట పండినట్లే. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవచ్చు. అటువంటి సందర్భాలు గంగపుత్రులకు అప్పుడప్పుడు దక్కుతుంటాయి. అటువంటి ఓ పల్లెకారుడి పంట పండి ఓ అరుదైన భారీ చేప వలలో పండింది. పాకిస్థాన్ లోని గ్వాదర్ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడికి లక్షలువిలువ చేసే చేప దక్కింది.

దీంతో ఆ చేప భారీ ధర పలకటంతో అతను రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు. జివానీలో నివసించే ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతడి వలలో అత్యంత అరుదైన ‘క్రోకర్ ఫిష్’ పడింది. ఈ చేపను పాకిస్థానలోని స్థానికులు సోవా లేక కిరి చేప అంటారు. ఈ చేప 48 కిలోల బరువు తూగింది. ఈ క్రోకర్ ఫిష్ ను వేలం వేయగా ఏకంగా పాకిస్థాన్ రూపాయి విలువలో రూ.8.64 లక్షలు ధర పలికింది.

ఈ చేపలోని ఓ భాగాన్ని ఫార్మా రంగంలో ఉపయోగిస్తారు. ఆపరేషన్ల చికిత్సలో వినియోగించే పరికరాల తయారీకి దీన్ని వినియోగిస్తారు. అందుకే ఈ క్రోకర్ ఫిష్ కు అంత డిమాండ్ ఉంటుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్ లో ఈ చేప మరీ భారీ ధర పలుకుతుంది. ఇటీవలే జివానిలో ఇటువంటి ఓ చేప లభ్యం అయ్యింది. ఆ చేప ధర రూ.7.80 లక్షలు (పాకిస్థానీ కరెన్సీ) పలికింది. పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్టుకు, ఇరాన్ కు మధ్య ఉన్న సముద్ర జలాల్లో ఇటువంటి జాతికి చెందిన చేపలు ఎక్కువగా లభ్యమవుతాయంటున్నారు స్థానికులు.