ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి

పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..

  • Published By: venkaiahnaidu ,Published On : March 7, 2019 / 04:28 AM IST
ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి

పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..

పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్.. భారత ఒత్తిడితో ఎట్టకేలకు దిగివచ్చి మసూద్ తమ దేశంలోనే ఉన్నాడని, అతడి ఆరోగ్యం బాగోలేదని పాక్ విదేశాంగశాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. పాక్ ద్వందనీతి మరోసారి ప్రపంచానికి తెలిసింది.
Also Read: అంతేగా…అంతేగా : ఒక్క భారత్ లోనే ఇంటర్నెట్ చీఫ్

తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జైషే ఉగ్రసంస్థ భారత్ లో అనేకదాడులకు పాల్పడిందని,పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ..జైషేతో భారత్ లో దాడులు చేయించినట్లు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. పాక్ కు చెందిన హమ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ నదీమ్ మాలిక్ తో బుధవారం(మార్చి-6,2019) టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ముషార్రఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2003 డిసెంబర్ లో రెండు జైషే తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. ప్రస్తుత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం జైషేపై తీసుకుంటున్న చర్యలను తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే మీరు అధ్యక్షుడిగా(1999-2008) ఉన్న సమయంలో ఎందుకు జైషేపై చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నకు..అప్పటి పరిస్థితులు వేరని ముషార్రఫ్ సమాదానం దాటవేశారు.

భారత్ లో జైషే అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. పార్లమెంట్ పై దాడి,ముంబై ఉగ్రదాడి, పుల్వామా ఉగ్రదాడి ఇలా భారత్ లో అనేకదాడులు చేసి వందలాదిమంది జైషే బలిగొన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాక్ లో రాజ్యాంగాన్ని రద్దు చేసిన ముషార్రఫ్ పై దేశద్రోహం కేసు నమోదైందన్న విషయం తెలిసిందే. ట్రీట్మెంట్ కోసమని దుబాయ్ వెళ్లి ఇప్పటివరకు ముషార్రఫ్ పాక్ లో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న ముషార్రఫ్…రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటే త్వరలో పాక్ లో అడుగుపెట్టబోతున్నట్లు తెలిపారు. 
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు