Pakistan’s Petrol Price: పాక్ లో మళ్లీ భారీగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?

ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ లో ధరల పెరుగుదలతో ఇప్పటికే ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారిపై ధరల భారాన్ని మరింత పెంచేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాక్ లో పలు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగాపెంచారు. రేపటి నుంచి లీటరు పెట్రోలు, డీజిల్ పై మరో రూ.32 (పాకిస్థానీ రూపాయి) చొప్పున పెంచాలని పాకిస్థాన్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

Pakistan’s Petrol Price: పాక్ లో మళ్లీ భారీగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?

Pakistan’s Petrol Price: ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ లో ధరల పెరుగుదలతో ఇప్పటికే ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారిపై ధరల భారాన్ని మరింత పెంచేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాక్ లో పలు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగాపెంచారు. రేపటి నుంచి లీటరు పెట్రోలు, డీజిల్ పై మరో రూ.32 (పాకిస్థానీ రూపాయి) చొప్పున పెంచాలని పాకిస్థాన్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

అమెరికా డాలరుతో పోల్చితే పాకిస్థాన్ రూపాయి మార‌కం విలువ రోజురోజుకీ ప‌డిపోతుండ‌డంతో పాక్ లో ధ‌ర‌ల‌ను పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెలకొంటున్నాయి. జనవరి 29న పాకిస్థాన్ ప్రభుత్వం లీట‌రు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను రూ.35 చొప్పున పెంచింది. ఇప్పటికే ఆ దేశంలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 249.80కు, డీజిల్ ధర లీట‌రుకు రూ.262.80కు పెరిగింది.

రేపటి నుంచి పాక్ లో పెట్రోల్‌ ధర లీటరుకు దాదాపు రూ.282 ఉండే అవకాశం ఉంది. అలాగే, డీజిల్ ధర లీట‌రుకు దాదాపు రూ.295 ఉండే అవకాశం ఉందని పాక్ మీడియా పేర్కొంది. మరోవైపు, లైట్‌ డీజిల్ ధరలు, కిరోసిన్ ధ‌ర‌ కూడా భారీగా పెరిగవచ్చని తెలిపింది. ఇప్పటికే పాక్ లో కిరోసిన్ ధర లీట‌రుకు రూ.189.83గా ఉంది.

లైట్‌ డీజిల్ లీట‌రుకు రూ.187 ఉంది. రేపటి నుంచి కిరోసిస్ 14.8 శాతం పెరిగే అవకాశం ఉంది. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ నుంచి నిధులు తీసుకోవడంలో పాకిస్థాన్ కు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాక్ కు అప్పులు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదు.

Elon Musk : ట్విట్టర్ కొత్త ‘సీఈవో’ అంటూ పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసిన ఎలాన్ మస్క్