ఆయన అన్నాడంటే ఏమైనా జరగొచ్చు : అక్టోబర్ లో భారత్-పాక్ యుద్ధం

ఆయన అన్నాడంటే ఏమైనా జరగొచ్చు : అక్టోబర్ లో భారత్-పాక్ యుద్ధం

భారత్-పాక్‌ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్‌తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే మంత్రి ఇలా మాట్లాడారు. 

‘ఐక్యరాజ్య సమితి కశ్మీర్ విషయంపై పరిష్కారం చేయాలనుకుంటే ఇప్పటికీ సాధ్యమే. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తుల వల్ల కశ్మీర్ స్వతంత్య్రత కోల్పోతుంది. ఇంత అన్యాయం జరుగుతుంటే ముస్లిం దేశాలన్నీ ఏం చేస్తున్నాయి. మొహర్రం తర్వాత మరోసారి కశ్మీర్ లో పర్యటిస్తాం. క్వాద్ ఏ అజామ్ మొహమ్మద్ అలీ జిన్నాహ్ ముస్లిం వ్యతిరేకంగా భారత్ తయారవుతోందని ఎప్పుడో చెప్పారు. దానిని అప్పుడు వ్యతిరేకించిన వాళ్లంతా మూర్ఖులు’

‘ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్ 27న ఇమ్రాన్ ఖాన్ స్పీచ్‌లో కీలక విషయాలన్నీ వెలువడతాయి.  చైనా లాంటి ఫ్రెండ్ మాతో పాటు ఉండడం సంతోషంగా ఉంది. పాక్ ప్రభుత్వం తమ దేశం మీదుగా విమానాలు వెళ్లకుండా ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది . భారత్ వ్యాపారం కోసం పాకిస్తాన్ మీదుగా అఫ్గనిస్తాన్ వెళ్లే దారులను కూడా త్వరలో మూసేస్తాం. మోడీ మొదలుపెట్టాడు మేం ముగిస్తాం’ అని ట్వీట్ చేశాడు పాక్ రైల్వే మంత్రి. 

ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత్ ఎయిర్ ఫోర్స్ విభాగం బాలాకోట్ వేదికగా ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రక్యాంపులపై దాడి చేసింది. ఈ ఘటన తర్వాత న్యూ ఢిల్లీ నుంచి వచ్చే విమానాలకు కాకుండా బ్యాంకాక్, కౌలాలంపూర్ ఎయిర్ ఫోర్స్ లను మార్చి 27వరకూ క్లోజ్ చేసి ఉంచింది. ఆ తర్వాత జులై 16న ఓపెన్ చేసిన ఎయిర్ స్పేస్ ను మళ్లీ ఆగష్టు 5నుంచి క్లోజ్ చేసి ఉంచింది.