పాక్ వీడియో రిలీజ్ : భారత సబ్ మెరైన్ అడ్డుకున్నాం

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2019 / 09:42 AM IST
పాక్ వీడియో రిలీజ్ : భారత సబ్ మెరైన్ అడ్డుకున్నాం

పాకిస్తాన్ మరో కొత్త నాటకానికి తెరదీసింది. సోమవారం రాత్రి పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత సబ్ మెరైన్ ను అడ్డుకున్నట్లు పాక్ నేవీ అధికార ప్రతినిధి మంగళవారం(మార్చి-5,2019) తెలిపారు. 2016 నుంచి పాక్ జలాల్లోకి భారత సబ్ మెరైన్ ప్రవేశించడాన్ని పాక్ గుర్తించడం ఇది రెండోసారి అని తెలిపారు. తమ దగ్గరున్న ప్రతేక్యమైన నైపుణ్యాలను ఉపయోగించి భారత సబ్ మెరైన్ ను పాక్ జలాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Also Read : గురి చూసి కొట్టారు : పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్

గగనతలం నుంచి తీసిన ఈ వీడియోలో నీటిపై తేలుతూ వెళ్తున్న సబ్ మెరైన్ కనిపిస్తుంది. ఈ వీడియోపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో ఇప్పటిది కాదని, పాక్ మరో కొత్త నాటకానికి తెరదీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడి తర్వాత దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల మధ్య యుద్థవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

ఇటువంటి సమయంలో పాక్ ఈ వీడియోను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వీడియో నిజమా, అబద్దామా అని నిర్థారించే పనిలో ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. భారత్ మాత్రం పాక్ వీడియోను కొట్టిపారేస్తోంది. భారత సబ్ మెరైన్.. పాక్ జలాల్లోకి ప్రవేశించలేదని స్పష్టం చేసింది.
Also Read : ఇది కొంచెం ఢిఫరెంట్… బీర్ బాత్ టబ్ ఛాలెంజ్ చూశారా?