Home » International » ఇమ్రాన్ భవితవ్యం తేలేది నేడే
Updated On - 10:36 am, Sat, 6 March 21
Pakistan PM Imran Khan : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఆయన పొలిటికల్ భవిష్యత్ తేలనుంది. 2021, మార్చి 06వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. దిగువ సభలో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు. ఇమ్రాన్ మంత్రివర్గంలోని ఆర్థిక మంత్రి అబ్దుల్లా పార్లమెంట్ ఎగువ సభలో ఓడిపోయారు. ప్రతిపక్షాలు బలపరిచిన మాజీ ప్రధాని యూసఫ్ రాజా..విజయం సాధించారు. దీంతో…ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి.
ఓటింగ్ కంటే ముందుగానే..ఇమ్రాన్ రాజీనామా చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ నుంచి తాను విశ్వాస పరీక్షను కోరుతానని తొలుత ఆయన ప్రకటించారు. పైగా సెనెట్ ఎన్నికల్లో తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఓడిపోవడంతో…గౌరవ ప్రదంగా ఇమ్రాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 104 మంది సభ్యులున్న ఎగువ సభలో ప్రస్తుతం ప్రతిపక్షాల హవా నడుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి వెల్లడించారు కూడా.
అయితే..విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ నెగ్గుతారని, ఆర్థిక మంత్రి ఒక్కరు ఓడిపోతే…ఇమ్రాన్ కు వచ్చిన నష్టం ఏమి లేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, మళ్లీ ఎన్నికలు పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆందోళనలు, నిరసనలకూ పిలుపునిచ్చాయి. మరి ఇమ్రాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ దేశాలు పాక్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Pakistan Visa to Indians : వైశాఖి పర్వదినం..1100 మంది భారతీయులకు వీసాలు జారీ చేసిన పాకిస్థాన్
Saranga Dariya Song: మరోసారి బొమ్మ దద్దరిల్లడం ఖాయమట!
భారత్ నుంచి పత్తి,చక్కెర దిగుమతులపై పాక్ ప్రధాని యూటర్న్
ఇండియాకి పాక్ షేక్ హ్యాండ్
Dont Marry Them : ఆ నాలుగు దేశాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు : సౌదీ అరేబియా ఆదేశం
భారత్ తో దోస్తీకి పాక్ రెడీ..పాత విషయాలు పాతిపెడదామన్న పాక్ ఆర్మీ చీఫ్