భారతీయులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరిచిన పాక్ పోలీసులు

పాకిస్తాన్ చెరలో చిక్కిన ప్రశాంత్ వైందంను అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన వరిలాల్‌ ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. ఇద్దరు

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 11:50 AM IST
భారతీయులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరిచిన పాక్ పోలీసులు

పాకిస్తాన్ చెరలో చిక్కిన ప్రశాంత్ వైందంను అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన వరిలాల్‌ ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. ఇద్దరు

పాకిస్తాన్ చెరలో చిక్కిన ప్రశాంత్ వైందంను అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన వరిలాల్‌ ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. ఇద్దరు భారతీయులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులో ఉన్న ప్రశాంత్‌ను కోర్టులో హాజరుపరచాలని స్థానిక న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రశాంత్‌, వరిలాల్‌ను యాజ్మాన్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు. 

పాకిస్తాన్‌లోకి అక్రమంగా చొరబడుతుంటే గమనించిన పెట్రోలింగ్ టీమ్‌ అదుపులోకి తీసుకుందని విచారణ సందర్భంగా ఎఫ్‌ఐఏ టీమ్‌ కోర్టుకు తెలిపింది. పాకిస్తాన్‌ ఎంట్రీ యాక్షన్‌ 1952 ప్రకారం వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. విచారణ తర్వాత ఇద్దరిని తిరిగి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.  

ప్రశాంత్ వైoదం వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన బంధువులు. 10 టీవీ ద్వారా సమాచారం తెలుసుకున్న కంచరాం గ్రామంలోని ప్రశాంత్ బంధువులు అతను క్షేమంగా దేశానికి తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగం నిమిత్తం పదేళ్ల క్రితం ప్రశాంత్ గ్రామాన్ని వీడాడు. విశాఖపట్నం, బెంగుళూరులో ఉన్నాడు. ప్రస్తుతం పాక్ పోలీసులకు చిక్కాడు. ప్రశాంత్ క్షేమంగా తిరిగి ఎప్పుడు వస్తాడోనని బంధువులు ఎదురుచూస్తున్నారు. భారత్ రాయబార ప్రతినిధులు, కేంద్రం జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను త్వరగా ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తన ప్రియురాలి కోసం వెతుక్కుంటూ వెళ్లిన ప్రశాంత్.. పాకిస్తాన్ లోకి ప్రవేశించాడు. వీసా, పాస్ పోర్టు లేకుండా తమ భూభాగంలోకి వచ్చాడని పాక్ పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. ప్రశాంత్ తో పాటు వరిలాల్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఉగ్రవాదులు, ఉగ్రదాడులు చేసేందుకు పాక్ లోకి చొరబడ్డారు అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు పాక్ పోలీసులు.

కాగా, ప్రశాంత్‌పై మీడియాలో అసత్య ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. ప్రశాంత్‌ రా ఏజెంట్ కాదని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. దుష్ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత్‌ విషయంలో తొలి నుంచి వాస్తవాలనే ప్రసారం చేస్తోంది 10టీవీ. ప్రశాంత్‌ అరెస్ట్ వ్యవహారాన్ని 10టీవీనే వెలుగులోకి తెచ్చింది. ప్రియురాలి కోసమే ప్రశాంత్‌ సరిహద్దులు దాటాడని కథనాలు ప్రసారం చేసింది.

త్వరలోనే ప్రశాంత్‌.. భారత్‌కు తిరిగివచ్చే అవకాశం ఉందన్నారు సీపీ సజ్జనార్. దౌత్యపరంగానే ప్రశాంత్ విడుదల సాధ్యమవుతుందన్న ఆయన.. ప్రశాంత్‌ మిస్సింగ్‌పై ఫిర్యాదు అందిన వెంటనే తాము చాలా గాలించామన్నారు. లుకౌట్‌ నోటీసులు ఇచ్చినా అతడి ఆధారాలు దొరకలేదన్నారు. భారతీయులెవరైనా పాకిస్తాన్‌లో పట్టుబడితే ఆ దేశం అనుమానించడం సహజమేనన్నారు సీపీ సజ్జనార్. అయితే.. ప్రశాంత్ అమాయకుడన్న విషయం పాకిస్తాన్‌ ఇప్పటికే గుర్తించిందన్న సీపీ.. అసలు ప్రశాంత్‌ అక్కడికి ఎందుకు వెళ్లాడన్న దానిపై తాము దర్యాప్తు చేస్తామన్నారు.