72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 27, 2019 / 10:19 AM IST
72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు

రాబోయే 72గంటలు అత్యంత కీలకమైన సమయమని, భారత్ తో కనుక యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద యుద్ధంగా ఉంటుందని, ఇదే చివరి యుద్ధం కూడా అవుతుందని  పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. పాక్ పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధంగా ఉండటంతో ఇది ఒక భయంకరమైన యుద్ధంగా ఉండబోతుందని అన్నారు. పాక్ లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఉందని అన్నారు.
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్
​​​​​​​

అత్యవసర పరిస్థితి చట్టాలను రైల్వే ఇప్పటికే ఫాలో అవుతుందని అన్నారు. యుద్ధమా లేక శాంతి అన్నది రాబోయే 72 గంటల్లో తేలిపోతుందని, పరోక్షంగా భారత్ అంతు చూస్తామంటూ పిచ్చి వాగాడు వాగాడు. కొన్ని రోజుల క్రితం ఓ సందర్భంలో రషీద్ మాట్లాడుతూ.. ఎవరైనా పాక్ ని నెగెటీవ్ కోణంలో చూస్తే..ఆ కళ్లను పీకి పడేస్తామని అన్నారు. భారత్ లో గడ్డి మొలవదని, పక్షులు ఎగురవని, ఆలయాల్లో గంటలు మోగవని అన్న విషయం తెలిసిందే.

భారత్ కూడా ఈ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చింది. పుల్వామా ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్  మంగళవారం(ఫిబ్రవరి-26,2019) పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని పుల్వామా దాడికి కారణమైన జైషే ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్ జోలికొస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఉగ్రవాదలకు ఆశ్రయమిస్తున్న పాక్ ను భారత్ హెచ్చరించింది.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

దీంతో బుధవారం(ఫిబ్రవరి27,2019) సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎలోవోసి దాడిలోకి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. రెండు దేశాలు కూడా సరిహద్దుల్లోని ఎయిర్ పోర్ట్ లను మూసివేశారు. సరిహద్దుల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు